శుక్రవారం, 10 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. కరోనా
Written By సెల్వి
Last Updated : గురువారం, 17 డిశెంబరు 2020 (10:26 IST)

తెలంగాణలో తగ్గిన కరోనా కేసులు.. కొత్తగా 509 కేసులు

తెలంగాణలో కరోనా కేసుల ఉధృతి క్రమంగా తగ్గుతుంది. గత కొన్ని రోజులుగా రాష్ట్రంలో కేసుల సంఖ్య గణనీయంగా తగ్గిపోయింది. తాజాగా రిలీజ్ చేసిన కరోనా బులెటిన్ ప్రకారం రాష్ట్రంలో కొత్తగా 509 కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో రాష్ట్రంలో నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య 2,79,644కి చేరింది. ఇందులో 2,70,967 మంది కోలుకొని డిశ్చార్జ్ కాగా, 7,172 కేసులు యాక్టివ్‌గా ఉన్నాయి. 
 
ఇక తెలంగాణలో కరోనాతో ముగ్గురు మృతి చెందారు. దీంతో రాష్ట్రంలో నమోదైన మొత్తం కరోనా మరణాల సంఖ్య 1505కి చేరింది. బుధవారం రాత్రి 8 గంటల వరకు తెలంగాణలో 48,652 కరోనా నిర్ధారణ టెస్టులు నిర్వహించారు. దీంతో తెలంగాణలో నిర్వహించిన మొత్తం కరోనా టెస్టుల సంఖ్య 63,06,397కి చేరింది.