స్పైస్ జెట్ కీలక నిర్ణయం.. 30 రూట్లకు సర్వీసులు ప్రారంభం
కరోనా కారణంగా రద్దుచేసుకున్న విమానాల్లో 80శాతం వరకు సర్వీసులను ఆరంభించవచ్చుననే కేంద్ర ప్రభుత్వ సూచనల మేరకు స్పైస్ జెట్ కీలక నిర్ణయం తీసుకుంది. స్పైస్‌జెట్ మరో 30 రూట్లకు సర్వీసులను దశలవారీగా వచ్చే వారం నుంచి ఆరంభించబోతున్నట్లు ప్రకటించింది.
ఇందులో భాగంగా శనివారం నుంచి అహ్మదాబాద్, పుణె, హైదరాబాద్‌ల నుంచి బీహార్‌లోని దార్‌భంగ మధ్య విమాన సర్వీసులు నడుపబోతుంది. అలాగే కొత్తగా హైదరాబాద్-వైజాగ్, ముంబై-గోవా, కోల్‌కతా-గోవా, అహ్మదాబాద్-గోవా, ముంబై-కంద్లా, ముంబై-గువాహటి, గువాహటి-కోల్‌కతా, చెన్నై-షిర్డిల మధ్య సర్వీసులు రానున్నాయి. మొత్తంగా తెలుగు రాష్ట్రాల మధ్య కూడా స్పైస్ జెట్ సర్వీసులు ప్రారంభం కాబోతున్నాయి.
కాగా, కరోనా వైరస్ వ్యాప్తి కారణంగా.. జాతీయ, అంతర్జాయ విమానా సర్వీసులను పూర్తిగా రద్దు చేసిన సంగతి తెలిసిందే.. క్రమంగా కేసులు తగ్గుముఖం పట్టడంతో.. అన్నింటికి కేంద్ర ప్రభుత్వం అనుమతి ఇస్తూ వస్తోంది.