శుక్రవారం, 28 నవంబరు 2025
  1. వార్తలు
  2. బిజినెస్
  3. వార్తలు
Written By సెల్వి
Last Updated : శుక్రవారం, 28 నవంబరు 2025 (17:37 IST)

శబరిమల వెళ్లే అయ్యప్ప భక్తులు శుభవార్త.. ఇరుముడిని విమానంలో తీసుకెళ్లవచ్చు..

Sabarimala
కేంద్ర పౌర విమానయాన మంత్రి కె. రామ్మోహన్ నాయుడు శబరిమల వెళ్లే అయ్యప్ప భక్తుల కోసం ఒక ముఖ్యమైన నిబంధనను ప్రకటించారు. శుక్రవారం 28 నవంబర్ 2025 నుండి వచ్చే ఏడాది జనవరి 20 వరకు, భక్తులు సాధారణ విమానాశ్రయ చెక్-ఇన్ విధానాలను పాటించకుండానే తమ ఇరుముడిని తీసుకెళ్లడానికి అనుమతించబడతారు.
 
శబరిమల దర్శనానికి వెళ్లే అయ్యప్ప స్వామి భక్తులు విమాన ప్రయాణం సమయంలో తమ పవిత్ర ఇరుముడిని (కొబ్బరికాయతో సహా) ఇప్పుడు చేతి సామానుగా తమతో పాటు తీసుకెళ్లే విధంగా ప్రత్యేక వెసులుబాటు కల్పిస్తూ కేంద్రప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. 
 
ఈ మేరకు భక్తుల విశ్వాసాలను పరిగణనలోకి తీసుకుని, పౌర విమానయాన మంత్రిత్వ శాఖ, సంబంధిత భద్రతా సంస్థలతో సమన్వయం చేసుకుని, అయ్యప్ప స్వాముల కోసం ప్రత్యేక మినహాయింపు అమలు చేయాలని నిర్ణయించినట్లు వెల్లడించారు. 
 
ఈ ప్రత్యేక సడలింపు ఈ రోజు (శుక్రవారం) నుంచి జనవరి 20 వరకు దేశవ్యాప్తంగా వర్తిస్తుందని తెలిపారు. ఈ కాలంలో శబరిమల యాత్రకు వెళ్లే భక్తులు, ఎయిర్‌పోర్టు భద్రతా తనిఖీలను పూర్తి చేసిన అనంతరం, తమ ఇరుముడిని చేతి సామానుగా విమాన క్యాబిన్‌లో తమతో పాటు తీసుకెళ్లవచ్చన్నారు.