ఏప్రిల్ నెలలో తెలుగు రాష్ట్రాల్లో బ్యాంకుల సెలవులు ఇవే...
కొత్త ఆర్థిక సంవత్సరం 2025-26 ప్రారంభనెల ఏప్రిల్ నెలలో రెండు తెలుగు రాష్ట్రాల్లోని బ్యాంకులకు పలు రోజుల పాటు సెలవులు రానున్నాయి. ప్రస్తుతం అత్యధికంగా ఆన్‌లైన్ బ్యాంకింగ్ వ్యవహరాలే జరుగుతున్నప్పటికీ.. గ్రామీణ ప్రాంతాల్లో మాత్రం ఇంకా బ్యాంకింగ్ కార్యకలాపాలు బ్యాంకుల్లోనే జరుగుతున్నాయి. ఈ క్రమంలో ఏప్రిల్ నెలలో రెండు తెలుగు రాష్ట్రాల్లో బ్యాంకులకు పలు సెలవు దినాలు వచ్చాయి. ఆ రోజుల్లో బ్యాంకులు మూతపడనున్నాయి.
ఆ ప్రకారంగా, ఏప్రిల్ ఒకటో తేదీన ఖాతాల సర్దుబాటు కారణంగా బ్యాంకులు పనిచేయవు. ఏప్రిల్ 5వ తేదీన బాబు జగ్జీవన్ రామ్ జయంతి, ఏప్రిల్ 14వ తేదీన డాక్టర్ అంబేద్కర్ జయంతి, ఏప్రిల్ 18వ తేదీన గుడ్‌ఫ్రైడే కారణంగా బ్యాంకులు మూతపడనున్నాయి. ఇవికాకుండా శనివారం, నాలుగు శనివారం, అన్ని ఆదివారాలు కలుపుకుని ఏప్రిల్ నెలలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పది రోజుల పాటు, తెలంగాణ రాష్ట్రంలో 11 రోజుల పాటు సెలవులు రానున్నాయి.