Film Chamber: జర్నలిస్టులపై ఆంక్షలు పెట్టేదెవరు? నియంత్రించేదెవరు?
ఇటీవల ప్రస్తుత జర్నలిజం పై తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తీవ్రంగా మండిపడ్డారు. అంతా తెలిసినవారే అని వారు అడిగినప్పుడు మాట్లాడితే దాన్ని రకరకాలుగా కథలు అల్లుతూ, థంబ్ లైన్స్ పెడుతూ ప్రభుత్వాన్ని బదనామ్ చేస్తున్నారని మండిపడ్డారు. అసలు నిజమైన జర్నలిస్టు ఎవరు? వారికి వున్న అర్హతలేమిటి? అని ఆయన అసెంబ్లీ సాక్షిగా నిలదీశారు.
తాజా అలాంటిదే తెలుగు సినిమా జర్నలిస్టులపై పడింది. ఒకప్పుడు ఒక్క అసోసియేషన్ మాత్రమే వుండేది. కరోనా తర్వాత మారిన సాంకేతికవల్ల టీవీ మాద్యమాలు, డిజిటల్, సోషల్ మీడియా వల్ల ఐదు అసోసియేషన్లు ఏర్పడ్డాయి. కానీ ఒక అసోసియేషన్ మాట మరో అసోసియేషన్ వినదు. మాట చెల్లనీయదని బహిరంగ రహస్యమే. దానిని అలుసుగా తీసుకుని కొంతమంది మీడియా పేరుతో రేవంత్ రెడ్డి మాట్లల్లో చెప్పాలంటే.. గొట్టాలుపట్టుకుని ఫంకన్లను షూట్ చేసి దానిలో ఏదో అంశాన్ని కంటెంట్ గా పెట్టి ఇష్టమొచ్చిన థంబ్ లైన్స్ పెట్టేస్తున్నారు. అలాగే మరికొంతమంది ఇటీవల దిల్ రుబా సినిమా హీరోయిన్ ఫొటోలు ఇవ్వనుఅంటే ఫొటో జర్నలిస్టు ఆమెను బేన్ చేసే దాకా వచ్చింది. తనకు అభ్యంతరకంగా వారు మారారని ఆమె ఫిలింఛాంబర్ లో ఫిర్యాదు చేసినట్లు తెలిసింది.
కాగా, శనివారంనాడు ఐదు అసోసియషన్ల ప్రముఖులను పిలిచి ఛాంబర్ ఆఫ్ కామర్స్ ప్రతినిధులుగా దామోదరప్రసాద్, ప్రసన్నకుమార్ చౌదరి మీటింగ్ ఏర్పాటు చేశారు. అందులో జర్నలిస్టులను నియంత్రించాలి. అసలు జర్నలిజం అంటే ఓనామాలు తెలీనివారి వల్లే ఇటువంటి సంఘటనలు జరుగుతున్నాయి. మీరంతా ఒక్కతాటిపై వుండి జర్నలిస్టులకు కార్డ్ లు ఇవ్వాలంటూ సూచించారు. ఒక్కోసారి చిన్న చిత్రాల నిర్మాతలే పబ్లిసిటీ కోసం సంబంధంలేని ప్రశ్నలను అడగమని పి.ఆర్.ఓ.లకు చెబుతున్నారని విమర్శ కూడా వుంది. కానీ ఎంత పబ్లిసిటీ చేసినా కనీసం నాలుగు టికెట్లు కూడా అటువంటి సినిమాలకు తెగవని దామోదర ప్రసాద్ తేల్చిచెప్పారు. సో. పబ్లిసిటీ అనేది ఆరోగ్యకరంగా వుండాలని ఆయన సూచించారు. మరి జర్నలిజం ఎటువైపు వెళుతుందో అనేది ప్రశ్నార్థకంగా మారింది.