శుక్రవారం, 24 జనవరి 2025
  1. వార్తలు
  2. బిజినెస్
  3. వార్తలు
Written By ఠాగూర్
Last Updated : ఆదివారం, 3 మే 2020 (18:05 IST)

పేదలకు కేంద్రం శుభవార్త... రెండో దశ నగదు జమకు శ్రీకారం

దేశంలోని పేదలకు కేంద్రం మరో శుభవార్త చెప్పింది. జన్‌ధన్ బ్యాంకు ఖాతాలు కలిగిన వారికి రెండో దఫా నగదు జమకు శ్రీకారం చుట్టింది. ఈ నగదును సోమవారం నుంచి విత్‌డ్రా చేసుకోవచ్చని తెలిపింది. 
 
దేశంలో కరోనా వైరస్ మహమ్మారి కట్టడి కోసం కేంద్రం లాక్‌డౌన్‌ను అమల్లోకి తెచ్చింది. ఈ సమయంలో పేదలు ఇబ్బందులు పడకుండా ఉండేందుకు వీలుగా నెలకు రూ.500 చొప్పున మూడు నెలల పాటు నగదు జన్‌ధన్ ఖాతాల్లోకి జమ చేయనున్నట్టు ప్రకటించింది. ఆ ప్రకారంగా ఏప్రిల్ నెలలో తొలి దఫా నగదును డిపాజిట్ చేసింది. రెండో దశ నగదు జమను మే నెలలో శ్రీకారం చుట్టింది. ఈ నగదును సోమవారం నుంచి డ‌బ్బుల‌ను తీసుకోవ‌చ్చ‌ని సూచించింది. 
 
ఈ నెల 4వ తేదీ నుంచి 11 వ‌ర‌కు అకౌంట్ నెంబ‌ర్ల‌లోని చివరి సంఖ్య‌ల ఆధారంగా చెప్పిన రోజుల్లో బ్యాంకుకు వెళ్లి, లేదా ఏటీఎం, ఆన్‌లైన్‌లో తీసుకోవ‌చ్చు. 11వ తేదీ త‌ర్వాత జ‌న్‌ధన్ మ‌హిళ‌ల‌ అంద‌రి అకౌంట్ల‌లో డ‌బ్బులు జ‌మ కానున్నాయి. 
 
జ‌మ అయిన‌ డ‌బ్బులు ఎక్క‌డికి పోవ‌ని, నిధానంగా తీసుకోవాల‌ని ఆయా బ్యాంకులు సూచిస్తున్నాయి. అయితే, బ్యాంకులకు వచ్చి తీసుకునే ఖాతాదారులు మాత్రం విధిగా సామాజిక భౌతిక దూరాన్ని పాటించాల్సిందేనని బ్యాంకులు స్పష్టం చేశాయి.