మా బ్యాంకు ఖాతాదారులకు మాత్రమే పాత నోట్ల మార్పిడి... : ఇండియన్ బ్యాంక్స్ అసోసియేషన్
రద్దు అయిన పాత కరెన్సీ నోట్ల మార్పిడికి ఇండియన్స్ బ్యాంక్స్ అసోసియేషన్ సరికొత్త షరతు విధించింది. ఆయా బ్యాంకుల్లో ఖాతాలో ఉన్న వారికి మాత్రమే కొత్త నోట్లు ఇస్తామని తేల్చి చెప్పాయి. గత పది రోజులుగా తమ బ్
రద్దు అయిన పాత కరెన్సీ నోట్ల మార్పిడికి ఇండియన్స్ బ్యాంక్స్ అసోసియేషన్ సరికొత్త షరతు విధించింది. ఆయా బ్యాంకుల్లో ఖాతాలో ఉన్న వారికి మాత్రమే కొత్త నోట్లు ఇస్తామని తేల్చి చెప్పాయి. గత పది రోజులుగా తమ బ్యాంకు ఖాతాదారులకు ఎలాంటి సేవలు అందించలేక పోతున్నామనీ, ఇక అందువల్ల తమ బ్యాంకు ఖాతాదారులకు మాత్రమే ఈ సేవలు అందిస్తామని తెలిపింది.
ఈ విషయంపై ఇండియన్ బ్యాంక్స్ అసోసియేషన్ ఛైర్మన్ రాజీవ్ రిషి మాట్లాడుతూ... పాత నోట్లకు కొత్త నోట్ల మార్పిడి శనివారం బ్యాంకుల సొంత ఖాతాదారులకు మాత్రమే పరిమితమవుతాయని చెప్పారు. అంటే.. ఖాతాదారులు ఏ బ్యాంకులో పడితే ఆ బ్యాంకులో పాత నోట్లు మార్చుకోవడం వీలుపడదన్నారు.
కేవలం తమకు ఖాతా ఉన్న బ్యాంకులో మాత్రమే మార్చుకోగలరని వివరించారు. ప్రధాని నరేంద్ర మోడీ నోట్ల రద్దు నిర్ణయం ప్రకటించిన రోజు నుంచీ.. ఖాతాదారులు కానివారు కూడా నోట్లు మార్పిడి చేసుకోవడానికి రావడంతో తమ సొంత కస్టమర్లకు సేవ చేయలేకపోయామన్నారు. దీంతో తమ పని కూడా పెండింగ్‌లో పడిందిన్నారు.
అందువల్ల శనివారం ఆ పెండింగ్ పని పూర్తిచేసుకోవడంతోపాటు సొంత ఖాతాదారుల కోసం మాత్రమే పనిచేస్తామని, ఇతర బ్యాంకులకు చెందినవారి నోట్లను మార్పిడి చేయకూడదని నిర్ణయించామని వెల్లడించారు. కానీ, సీనియర్ సిటిజన్లకు మాత్రం మినహాయింపు ఉంటుందని.. వారు ఏ బ్యాంక్ బ్రాంచ్‌కైనా వెళ్లి నగదు మార్చుకోవచ్చన్నారు. ఈ షరతు కేవలం ఈ ఒక్క శనివారానికే పరిమితమని ఆయన స్పష్టం చేశారు.