శనివారం, 28 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. బిజినెస్
  3. వార్తలు
Written By సెల్వి
Last Updated : గురువారం, 3 మార్చి 2022 (17:19 IST)

పెరిగిపోతున్న క్రూడాయిల్ ధరలు.. రికార్డు స్థాయిలో రేట్లు

Crude oil
రష్యా-ఉక్రెయిన్‌ మధ్య యుద్ధం మరింత ఉధృతం అవుతోంది. ఫలితంగా క్రూడాయిల్ ధరలు క్రమంగా పెరిగిపోతున్నాయి. గురువారం అంతర్జాతీయ మార్కెట్‌లో ముడిచమురు ధర ఏకంగా 117 డాలర్లకు చేరింది. ఇది దశాబ్దంలో గరిష్ఠ స్థాయి కావడం గమనార్హం. 
 
బ్రెంట్‌ క్రూడ్‌ ధర 2014 తర్వాత తొలిసారిగా బ్యారెల్‌కు 100 డాలర్లు దాటేసింది. గత నాలుగు నెలలుగా క్రమంగా పెరుగుతూ పోతోంది.  ముఖ్యంగా ఈ ఏడాది ప్రారంభం నుంచి ముడిచమురు ధరలు భారీగా పెరుగుతూ వస్తున్నాయి. 
 
ఇవాళ ఏకంగా పదేళ్ల రికార్డును బద్దలు కొడుతూ గరిష్ఠ స్థాయికి చేరిన పిడుగులాంటి వార్త ఇప్పుడు అందరినీ ఆందోళనకు గురిచేస్తోంది. వీటి ప్రభావం భారత్‌పై కూడా తీవ్రంగా ఉంటుందని అంచనా వేస్తున్నారు. భారత్‌లో పెట్రోల్‌, డీజిల్‌ ధరలు భారీగా పెరిగే అవకాశం ఉంది.