ఆదివారం, 17 నవంబరు 2024
  1. వార్తలు
  2. బిజినెస్
  3. వార్తలు
Written By సెల్వి
Last Updated : మంగళవారం, 15 నవంబరు 2022 (12:08 IST)

కమర్షియల్ గ్యాస్ సిలిండర్లపై ఆ డిస్కౌంట్ తొలగింపు.. ఇక కష్టమే

LPG Cylinder
ప్రభుత్వ రంగానికి చెందిన ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు వినియోగదారులకు చెక్ పెట్టేందుకు రంగం సిద్ధం చేస్తున్నాయి. దీంతో సిలిండర్ వాడే వారి జేబుకు చిల్లులు పడనున్నాయి. ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు కమర్షియల్ గ్యాస్ సిలిండర్లపై అధిక డిస్కౌంట్‌ను అందిస్తున్నాయని ఫిర్యాదులు వెల్లువెత్తాయి. 
 
ఈ నేపథ్యంలో నవంబర్ 8 నుంచి ఆయిల్ మార్కెటింగ్ కంపెనీల కొత్త నిబంధన అమలులోకి వచ్చేసింది. అంటే ఇకపై కమర్షియల్ గ్యాస్ సిలిండర్ బుక్ చేసే వారు అధిక డబ్బులు చెల్లించుకోవాల్సి వస్తుంది. 
 
ఆయిల్ సంస్థలు ప్రస్తుతం కమర్షియల్ సిలిండర్లపై రూ.200 నుంచి రూ.300 వరకు డిస్కౌంట్ అందించేవి. ఈ రాయితీలను ప్రస్తుతం ఎత్తివేయనున్నాయి. ఫలితంగా కమర్షియల్ సిలిండర్లు వారిపై భారం తప్పేలా లేదు.