డెలివరీ బాయ్‌తో మాకు ఎలాంటి సంబంధం లేదు.. జొమాటో
యువతిని లైంగికంగా వేధించిన విషయంపై జొమాటో స్పందించింది. ఫుడ్ ఆర్డర్ ఇవ్వడానికి వెళ్లిన జొమాటో డెలివరీ బాయ్.. యువతిని లైంగికంగా వేధించిన వ్యవహారంపై జొమాటో స్పందించింది. డెలివరీ ఏజెంట్‌తో కంపెనీకి ఎలాంటి సంబంధం లేదని స్పష్టం చేసింది.
దీనిపై విచారణకు సిద్ధమని చెప్పింది. అధికారులతో సంప్రదింపులు జరుపుతున్నాం. మేము ఏ వ్యక్తినైనా ఆన్‌బోర్డ్ చేసేటప్పుడు థర్డ్ పార్టీ బ్యాక్‌గ్రౌండ్ వెరిఫికేషన్‌లను నిర్వహిస్తాం. అలాగే తాము జీరో టాలరెన్స్ పాలసీని కలిగివుంటామని జొమాటో తెలిపింది.
అంతేగాక నిందితుడు సర్టిఫైడ్ డెలివరీ ఏజెంట్ కాదని పేర్కొంది. అయితే జొమాటో స్టేట్‌మెంట్‌పై నెటిజన్లు మండిపడుతున్నారు. కాగా పుణెలోని యోవలేవాడి ప్రాంతంలో ఇంట్లో ఎవరూ లేకపోవడంతో 19 ఏళ్ల యువతి జొమాటోలో ఫుడ్ ఆర్డర్ పెట్టుకుంది.
ఫుడ్ డెలివరీకి వెళ్లిన రయీస్ షైల్జ్ అనే 42 ఏళ్ల యువతిపై వేధింపులకు పాల్పడ్డాడు. ఈ ఘటన మహారాష్ట్రలో సెప్టెంబర్ చోటుచేసుకుంది.