బుధవారం, 27 నవంబరు 2024
  1. వార్తలు
  2. బిజినెస్
  3. వార్తలు
Written By ఠాగూర్
Last Updated : మంగళవారం, 1 ఫిబ్రవరి 2022 (13:32 IST)

బంగారు ఆభరణాల దిగుమతిపై కస్టమ్స్ డ్యూటీ లిమిట్ పెంపు

బంగారు ఆభరణాల దిగుమతులను కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ నిరుత్సాహపరిచారు. ఈ మేరకు ఆమె మంగళవారం లోక్‌సభలో ప్రవేశపెట్టిన 2022-23 వార్షిక బడ్జెట్‌ ప్రసంగంలో పేర్కొన్నారు. 
 
జ్యూవెలరీ ఆభరణాల దిగుమతిపై కష్టమ్స్ డ్యూటీ లిమిట్ పెంచుతున్నట్టు ప్రకటించారు. మరోవైపు, పాలిష్డ్ డైమండ్స్, జెమ్స్‌లపై కస్టమ్స్ డ్యూటీని ఐదు శాతానికి తగ్గించారు. 
 
మన దేశంలో బంగారం ఆభణాలపై అమితమైన మక్కువ ఉంది. దేశంలో ఉత్పత్తి చేసే బంగారం సరిపోక పోవడంతో ఇతర ప్రాంతాల నుంచి దిగుమతి చేసుకుంటారు. ఈ బంగారం దిగుమతిపై కస్టమ్స్ డ్యూటీని పెంచారు. దీని ప్రభావం బంగారం ధరలపై పడే అవకాశం ఉంది.