శుక్రవారం, 27 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. బిజినెస్
  3. వార్తలు
Written By ఐవీఆర్
Last Modified: శనివారం, 28 సెప్టెంబరు 2019 (16:37 IST)

దసరా ధమాకా, ఎస్బీఐ హోమ్ లోన్ వడ్డీ రేటు @8.15%, అంతా అటే వెళ్లిపోతారంతే...

దసరా పండుగ అనగానే ఉద్యోగులు బోనస్‌లు వస్తాయని ఎదురుచూస్తుంటారు. ఏదో ఇంటి రుణాలు తీసుకున్న EMI కట్టేందుకు కాస్త చేదోడువాదోడుగా వుంటాయని అనుకుంటారు. ఐతే స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అనూహ్యంగా దసరా పండుగ సందర్భంగా కస్టమర్లకు బ్రహ్మాండమైన గిఫ్ట్ ఇచ్చేసింది. 
 
ఆ బహుమతి ఏంటంటే... హోమ్ లోన్ వడ్డీ రేటు 8.15%గా ప్రకటించింది. ఇంత తక్కువ వడ్డీ రేటుకి ఏ బ్యాంకు ఇప్పటివరకూ గృహ రుణం ఇవ్వడంలేదు. తగ్గించిన ఈ వడ్డీ రేటు అక్టోబరు 1 నుంచి అమలులోకి వస్తాయని బ్యాంకు తెలియజేసింది. కొత్తగా ఇంటి రుణాలు తీసుకోదలచినవారంతా ఎస్బీఐ ఆఫర్ దెబ్బకు అటే వెళ్లిపోతారనడంలో సందేహం లేదు.