సోమవారం, 23 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. ఐటీ
  3. ఐటీ వార్తలు
Written By సెల్వి
Last Updated : మంగళవారం, 24 సెప్టెంబరు 2019 (14:35 IST)

అమేజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్.. స్మార్ట్ ఫోన్లపై ఆఫర్లు

ఈ-కామెర్స్ సంస్థ అమేజాన్ స్మార్ట్‌ఫోన్లపై భారీ ఆఫర్లు అందివ్వనుంది. సెప్టెంబర్ 29వ తేదీ నుంచి అక్టోబర్ 4వ తేదీ వరకు అమేజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్ జరుగబోతోంది.

ఈ సేల్‌లో స్మార్ట్‌ఫోన్ కొనాలనుకునేవారికి గుడ్ న్యూస్ ఖాయం. గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్ 2019 ప్రకటించిన నాటి నుంచి ఈ సేల్‌లో ఈ ఏడాదిలోనే తక్కువ ధరకే మొబైల్స్ అందిస్తామని చెబుతోంది అమెజాన్. వేర్వేరు స్మార్ట్‌ఫోన్లపై 40శాతం వరకు డిస్కౌంట్ ఇవ్వనుంది.
 
అమేజాన్ ప్రైమ్ మెంబర్లకు సెప్టెంబర్ 28 మధ్యాహ్నం నుంచే సేల్ మొదలవుతుంది. ఈ సేల్‌లో ఎలక్ట్రానిక్స్, అప్లయెన్సెస్, ఫ్యాషన్ వేర్‌, ఫర్నీచర్‌పై డిస్కౌంట్లు ప్రకటించింది అమేజాన్.

వాటితో పాటు స్మార్ట్‌ఫోన్లపై ఏకంగా 40శాతం వరకు డిస్కౌంట్ ఇచ్చే అవకాశముంది. ఇప్పటికే హానర్ స్మార్ట్‌ఫోన్ల డిస్కౌంట్స్‌ని వెల్లడించింది. హానర్ 10 లైట్, హానర్ 20ఐ, హానర్ 8ఎక్స్, హానర్ 9ఎన్, హానర్ వ్యూ20 స్మార్ట్‌ఫోన్ల డిస్కౌంట్లను ప్రకటించింది.