గురువారం, 23 జనవరి 2025
  1. వార్తలు
  2. బిజినెస్
  3. వార్తలు
Written By ఐవీఆర్
Last Modified: శనివారం, 9 మార్చి 2024 (19:21 IST)

కరీంనగర్ ఫెర్టిలిటీ సెంటర్‌ను పునః ప్రారంభించిన ఫెర్టీ9

image
కరీంనగర్ లోని తమ ఫెర్టిలిటీ సెంటర్‌ను ఫెర్టీ9 తిరిగి ప్రారంభించింది. దీనితో పాటుగా నగరంలో సమగ్ర సంతానోత్పత్తి పరిష్కారాల కోసం మొట్టమొదటిసారిగా అధునాతన సాంకేతిక పరిజ్ఞానాన్ని పరిచయం చేసింది. ఐయుఐ, ఐవిఎఫ్, ఐసిఎస్ఐ, బ్లాస్టోసిస్ట్ కల్చర్, పిక్సీ, ఫెర్టిలిటీ ప్రిజర్వేషన్ మరియు జెనెటిక్ ప్రోగ్రామ్‌లతో సహా స్త్రీ, పురుష వంధ్యత్వానికి ప్రత్యేక చికిత్సలు ఇక్కడ అందుబాటులో ఉంటాయి. తమ సంతానోత్పత్తి ప్రయాణంలో రోగుల మానసిక క్షేమానికి తోడ్పడేందుకు అనుభవజ్ఞులైన కౌన్సెలర్ల బృందం సైతం ఇక్కడ అందుబాటులో ఉంది.
 
ఐవిఎఫ్ కన్సల్టెంట్ డాక్టర్ నాయని ఇంజమూరి మాట్లాడుతూ… " శ్రేష్ఠత కోసం మా తిరుగులేని అన్వేషణలో, ప్రతి వ్యక్తి యొక్క మాతృత్వపు ప్రయాణానికి సహకరించడాన్ని గౌరవంగా భావిస్తున్నాము. కారుణ్య సంరక్షణను అందించడం, విజయవంతమైన ఫలితాలను నిర్ధారించడం ద్వారా  మేము కేవలం  వైద్య నైపుణ్యానికి మాత్రమే కాకుండా భావోద్వేగ మద్దతుకు కూడా ప్రాధాన్యతనిస్తాము, వారికి సంతృప్తికరమైన అనుభవం ద్వారా మార్గనిర్దేశం చేస్తాము..". 
 
ఐవిఎఫ్ కన్సల్టెంట్, డాక్టర్ పూర్ణిమ జి మాట్లాడుతూ… "కరీంనగర్‌లో, మేము అత్యాధునిక సంరక్షణ యొక్క ప్రయాణాన్ని ప్రారంభించినప్పుడు మా నిబద్ధత పునరుద్ధరించబడింది. సమగ్ర మద్దతు కోసం వినూత్న విధానాలను ఉపయోగించి, ఆశ, అధునాతన సంతానోత్పత్తి పరిష్కారాలతో రోగులను శక్తివంతం చేయడానికి మేము ప్రయత్నిస్తున్నాము"
 
మెడికల్ డైరెక్టర్ డాక్టర్ సి జ్యోతి బుడి మాట్లాడుతూ… “పునరుత్పత్తి ఆరోగ్య సంరక్షణను అభివృద్ధి చేయడానికి అంకితమైన బృందానికి సహకరించడం పట్ల గర్విస్తున్నాము. మా అత్యాధునిక సదుపాయం ఖచ్చితత్వం, ఆవిష్కరణ, కారుణ్య సంరక్షణ పట్ల తిరుగులేని నిబద్ధతను ప్రతిబింబిస్తుంది. ఈ ప్రాంతంలో సంతానోత్పత్తి సేవలను పునర్నిర్వచించటానికి మాకు ఇది అవకాశం కల్పిస్తుంది, మన కమ్యూనిటీలోని కుటుంబాలకు తల్లిదండ్రులుగా  మారాలనే కలను నెరవేరుస్తుంది."