శుక్రవారం, 27 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ వార్తలు
Written By సెల్వి
Last Updated : శనివారం, 16 డిశెంబరు 2023 (12:52 IST)

కరీంనగర్ రోడ్డు ప్రమాదం.. ఇద్దరు మృతి.. మరొకరికి తీవ్రగాయాలు

car accident
శనివారం తెల్లవారుజామున కరీంనగర్‌లో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. కరీంనగర్ వైపు నుంచి వెళ్తున్న కారును శంకరపట్నం మండలం తాడికల్ వద్ద ఎదురుగా వచ్చిన లారీ బలంగా ఢీకొట్టింది. ఈ ఘటనలో కారులో ఉన్న ఇద్దరు అక్కడికక్కడే మృతి చెందగా, మరొకరు తీవ్రంగా గాయపడ్డారు. 
 
మృతులను జయశంకర్ భూపాలపల్లి జిల్లా టేకుమట్ల మండలం పెద్దంపల్లికి చెందిన ఆకాశ్ (22), ఏంపేడుకు చెందిన శ్రావణ్ (32)గా గుర్తించారు. గాయపడిన వారి సమీపంలోని ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకుని పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.