శుక్రవారం, 24 జనవరి 2025
  1. వార్తలు
  2. బిజినెస్
  3. వార్తలు
Written By సెల్వి
Last Updated : శనివారం, 3 జులై 2021 (12:16 IST)

ఎగిరే కారు ట్రయల్ రన్ విజయవంతం

Flying Car
స్లొవేకియాలో ఎగిరే కారు ట్రయల్ రన్ విజయవంతం అయ్యింది. నిత్రా విమానాశ్రయం నుంచి టేకాఫ్ అయిన కారు దాదాపు 8వేల ఎత్తుకు ఎగిరి రాజధాని బ్రాటిస్లావా అంతర్జాతీయ విమానాశ్రయంలో ల్యాండ్ అయ్యింది. 2.15 నిమిషాల్లోనే విమానంగా మారిపోయే ఈ కారు.. గంటకు 300 కిలోమీటర్ల వేగంతో పయనిస్తుంది.

ఈ ఎగిరే కారు ఒకసారి ఇంధనం నింపుకుంటే వెయ్యి కిలోమీటర్ల మేర ప్రయాణిస్తుంది. ఈ వాహనంలో ఇద్దరు వ్యక్తులు ప్రయాణించగలరు. ఈ కారు తయారీకి రెండేళ్లు పట్టిందని.. ఈ కారు సృష్టికర్త స్టీఫెన్ క్లిన్ తెలిపారు.