బుధవారం, 22 జనవరి 2025
  1. వార్తలు
  2. బిజినెస్
  3. వార్తలు
Written By ఐవీఆర్
Last Modified: సోమవారం, 20 మే 2024 (21:43 IST)

హైదరాబాద్ యువతకు క్రికెట్ మ్యాచ్ అనుభవాన్ని అందిస్తున్న గేమ్స్ 24x7ఫౌండేషన్

image
భారతదేశం యొక్క అత్యంత శాస్త్రీయ, వినియోగదారు-కేంద్రీకృత ఆన్‌లైన్ స్కిల్ గేమింగ్ ప్లాట్‌ఫారమ్ అయిన గేమ్స్ 24x7 యొక్క లాభాపేక్ష లేని విభాగం, గేమ్స్ 24x7 ఫౌండేషన్, వెనుకబడిన వర్గాలకు చెందిన ఔత్సాహిక యువతకు హైదరాబాద్‌లోని ఉప్పల్‌లో ఉన్న రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ స్టేడియంలో హైదరాబాద్, పంజాబ్ జట్ల మధ్య జరిగే టాటా ఐపీఎల్ టి-20 మ్యాచ్‌ను చూసే ఒక ప్రత్యేక అవకాశాన్ని అందించడానికి హైదరాబాద్‌లోని స్పోర్ట్స్ కోచింగ్ ఫౌండేషన్‌తో భాగస్వామ్యం కుదుర్చుకుంది. 
 
యువతలో క్రికెట్ పట్ల మక్కువను పెంపొందించడం లక్ష్యంగా, గేమ్స్ 24x7 ఫౌండేషన్ యొక్క కార్యక్రమం, మరపురాని క్షణాలను సృష్టించడమే కాకుండా అందుబాటులో అవకాశాల పట్ల నమ్మకాన్ని కలిగించటం, ప్రేరేపించడం, బలోపేతం చేయడం వంటి అనుభవాన్ని అందించడం లక్ష్యంగా పెట్టుకుంది. ముఖ్యంగా, గేమ్స్ 24x7 యొక్క ఫాంటసీ గేమింగ్ ప్లాట్‌ఫారమ్ మై 11 సర్కిల్, తదుపరి ఐదు సంవత్సరాలకు టాటా ఐపీఎల్ యొక్క అసోసియేట్ భాగస్వామి. సీజన్ మొత్తంలో, గేమ్స్ 24x7 ఫౌండేషన్ తమ వీల్స్ ఆఫ్ చేంజ్ కార్యక్రమం కింద ఎంపిక చేయబడిన నగరాల్లోని ఎన్జీఓలు, స్పోర్ట్స్ అకాడెమీలతో కలిసి బీద వర్గాల యువత, ఔత్సాహిక క్రీడాకారులకు సుసంపన్నమైన అనుభవాలను అందిస్తుంది.
 
ఈ కార్యక్రమం గురించి గేమ్స్24x7 సహ-వ్యవస్థాపకుడు & సహ-సీఈఓ భవిన్ పాండ్యా మాట్లాడుతూ, "దేశంలోని యువతకు అవసరమైన వనరులు, అవకాశాలను అందించడం ద్వారా ప్రకాశవంతమైన రేపటి కోసం ఆకాంక్షించేలా వారిని శక్తివంతం చేయడానికి అర్ధవంతమైన సహకారంను అందించటంపై గేమ్స్ 24x7 ఫౌండేషన్ దృష్టి సారించింది. పాతబస్తీలోని చారిత్రాత్మకదారుల నుంచి ఆధునిక వాతావరణ ప్రతిబింబం అయిన ఉప్పల్ స్టేడియం వరకు హైదరాబాద్‌ వాసులకు క్రికెట్‌పై ఉన్న ప్రేమకు అవధులు లేవు. వారి క్రికెట్ హీరోలు పోరాడుతుండగా చూసుకోవడం ఈ యువ అభిమానులకు అపారమైన ఆనందాన్ని కలిగించడమే కాకుండా వారిలో స్ఫూర్తిని, ఆశను రేకెత్తిస్తుంది. ఈ కార్యక్రమం, వారి క్రికెట్ ఆకాంక్షలను కొనసాగించడానికి వారిని ప్రోత్సహించడానికి ఒక చిన్న అడుగు" అని అన్నారు. 
 
హైదరాబాద్‌లోని స్పోర్ట్స్ కోచింగ్ ఫౌండేషన్ వ్యవస్థాపకుడు శ్రీ కె. సాయిబాబా మాట్లాడుతూ, 'గేమ్స్24x7 ఫౌండేషన్‌తో చేతులు కలపడం వల్ల రేపటి క్రికెట్ స్టార్‌లను మేము సంయుక్తంగా ఎలా అభివృద్ధి చేస్తున్నామో తెలియజేస్తుంది. హైదరాబాద్‌లో క్రికెట్‌పై ఉన్న ప్రేమ అసమానమైనది. రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ స్టేడియంలో తమ అభిమాన హీరోలను చూడటం వల్ల పిల్లలు ఏదో ఒక రోజు పెద్ద కలలు కనేలా, ఆ ఐకానిక్ గ్రౌండ్‌లో ఆడటానికి ప్రేరేపించగలరు. ఇది కేవలం ఒక మ్యాచ్ కంటే ఎక్కువ; ఇది భవిష్యత్ ఛాంపియన్‌లకు ఆశాకిరణం" అని అన్నారు. 
 
గేమ్స్ 24x7 ఫౌండేషన్ చేపట్టిన 'వీల్స్ ఆఫ్ చేంజ్' కార్యక్రమం భవిష్యత్ తరాలకు శాశ్వత సానుకూల ప్రభావాన్ని సృష్టించేందుకు దాని దృఢమైన నిబద్ధతను ప్రతిబింబిస్తుంది. జనవరిలో ప్రారంభించబడిన ఈ కార్యక్రమం ప్రారంభ దశ మహారాష్ట్రలోని మారుమూల జిల్లాల్లో ఉన్నత విద్యను అభ్యసించే బాలికలకు దూరపు భారాన్ని తగ్గించడానికి 1000 కంటే ఎక్కువ సైకిళ్లను అందించడంపై దృష్టి సారించింది.