గురువారం, 21 నవంబరు 2024
  1. వార్తలు
  2. బిజినెస్
  3. వార్తలు
Written By సెల్వి
Last Updated : మంగళవారం, 27 ఫిబ్రవరి 2024 (19:59 IST)

అమెరికాలో గూగుల్ పే సేవలు బంద్.. వాలెట్స్‌కు ఆదరణ

Google pay
అమెరికాలో జూన్ 4వ తేదీ నుండి గూగుల్ పే సేవలు ఆగిపోనున్నాయని సదరు సంస్థ ప్రకటించింది. అయితే గూగుల్ వాలట్ సేవను వినియోగదారులు ఉపయోగించుకోవచ్చు. అమెరికాలో గూగుల్ పే కంటే వాలట్ అప్లికేషన్ ఎక్కువగా వాడటం ద్వారా ఈ సేవల్లో గూగుల్ పేను ఆపి వేయాలని సదరు సంస్థ వెల్లడించింది. దీంతో గూగుల్ పే పాత వెర్షన్ పని చేయదు.
 
అమెరికాలో గూగుల్ పే సేవలను నిలిపివేసినా, భారత్, సింగపూర్ వంటి ఇతర దేశాలలో గూగుల్ పే యాప్ నిరంతరం పనిచేస్తుంది. గూగుల్ వాలట్ యాప్‌కు మారేలా గూగుల్ పే యూజర్లను గూగుల్ సూచిస్తుంది. భారత్‌లో యూపీఐ పేమెంట్ సిస్టమ్‌కు మంచి ఆదరణ దక్కుతోంది. 
 
ఫోన్ పే, గూగుల్ పే, పేటీఎం, అమెజాన్ పే వంటి పేమెంట్ యాప్స్ కూడా పెరిగిపోతున్న సంగతి తెలిసిందే. ఇక ఆన్‌లైన్ పేమెంట్ కోసం మాత్రమే కాకుండా.. డ్రైవింగ్ లైసెన్స్, ట్రాన్సిట్ కార్డులు, ఇతర ఐడీ కార్డులు వంటి డాక్యుమెంట్లు కూడా దీంట్లో భద్రపర్చుకోవచ్చు. ఈ కారణంగానే యూఎస్‌లో గూగుల్ పే కు మించి గూగుల్ వాలెట్ ఎక్కువ ఆదరణ పొందింది.