రైల్వే ప్రయాణీకులకు షాక్.. అంతా కోవిడ్ వల్లే..?
రైల్వే ప్రయాణికులకు మరో షాక్ తగిలింది. దేశవ్యాప్తంగా ఉన్న రైల్వే స్టేషన్లలో ఫ్లాట్‌ఫామ్ టికెట్ ధరలను పెంచుతున్నట్లు రైల్వే శాఖ షాకింగ్ నిర్ణయం తీసుకుంది. ప్లాట్‌ఫామ్ టికెట్ ధరలను రూ.10 నుంచి రూ.30కి పెంచుతున్నట్లు రైల్వే శాఖ నిర్ణయం తీసుకుంది.
ఇకపై లోకల్ ట్రైన్లలో కనీస ఛార్జీని రూ. 30గా నిర్ణయించింది. అసలే దేశవ్యాప్తంగా పెట్రోల్, డీజిల్ రేట్లు పెరిగి ఇబ్బందులు పడుతున్న సామాన్యులకు ఇది మరో షాక్ అనే చెప్పాలి.
అయితే.. దీనిపై కేంద్ర ప్రభుత్వం వాదన మరోలా ఉంది. పెరిగిన ప్లాట్ ఫామ్ టికెట్ ధరలు తాత్కాలికమేనని కేంద్ర రైల్వే మంత్రిత్వ శాఖ పేర్కొంది.
కరోనా వ్యాప్తి నేపథ్యంలో రైల్వే స్టేషన్లలో రద్దీని నియంత్రించేందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపింది. ప్లాట్‌ఫామ్ టికెట్ ధరల మార్పు నిర్ణయాధికారాన్ని డివిజనల్ రైల్వే మేనేజర్లకు అప్పగించినట్లు పేర్కొంది.