ఐడీఎఫ్‌సీ నిఫ్టీ 100 లో-వోలాటిలిటీ 30 ఇండెక్స్ ఫండ్‌ను విడుదల చేసిన ఐడీఎఫ్‌సీ మ్యూచువల్ ఫండ్
ఐడీఎఫ్‌సీ నిఫ్టీ 100 లో-వోలాటిలిటీ 30 ఇండెక్స్ ఫండ్‌ను విడుదల చేసినట్లు ఐడీఎఫ్‌సీ మ్యూచువల్ ఫండ్ వెల్లడించింది. ఇది ఓపెన్ ఎండెడ్ ఇండెక్స్ పథకం. దీనిలో 30 అతి తక్కువ వోలటైల్ స్టాక్స్ భాగంగా ఉంటాయి. ఈ నూతన ఫండ్ ఆఫర్‌ను సెప్టెంబర్ 15, 2022న తెరుస్తారు. సెప్టెంబర్ 23, 2022న మూసి వేయనున్నారు. లైసెన్స్‌డ్ మ్యూచువల్ ఫండ్ డిస్ట్రిబ్యూటర్లు, ఆన్‌లైన్ వేదికలతో పాటుగా ఐడీఎఫ్‌సీ వెబ్‌సైట్ ద్వారా పెట్టుబడులు పెట్టవచ్చు.
ఐడీఎఫ్‌సీ నిఫ్టీ 100 లో వోలాటిలిటీ 30 ఇండెక్స్ ఫండ్‌ను తమ పోర్ట్‌ఫోలియోకు జోడించడం గురించి ఐడీఎఫ్‌సీ ఏఎంసీ సీఈఓ విశాల్ కపూర్ మాట్లాడుతూ, పొదుపరులు నుంచి మదుపరులుగా భారతీయులు మారుతున్న వేళ స్టాక్ మార్కెట్ ఒడిదుడుకులు ఎంతోమంది మదుపరులకు ప్రతికూలంగా మారడంతో పాటుగా తరచుగా తప్పనిసరిగా వారు ప్రతిస్పందించాల్సి రావడంతో పాటుగా తరువాత బాధపడాల్సి వస్తుంది. ఈ లో-వోలటాలిటీ వ్యూహం మదుపరులకు ఈక్విటీల నుంచి ప్రయోజనం పొందే అవకాశం కల్పించడంతో పాటుగా మొత్తంమ్మీద పెట్టుబడి లక్ష్యాలను చేరుకోవడంలోనూ వారికి సహాయపడుతుందిఅని అన్నారు.