శుక్రవారం, 22 నవంబరు 2024
  1. వార్తలు
  2. బిజినెస్
  3. వార్తలు
Written By ఠాగూర్
Last Updated : సోమవారం, 29 మే 2023 (11:56 IST)

ఐటీ నోటీసులకు స్పందించకుంటే ఇక తనిఖీలే...

income tax
ఆదాయపు పన్ను (ఐటీ) విభాగం స్క్రూటినీ (పునః పరిశీలన) కోసం కేసులను ఎలా ఎంపిక చేయాలనే విషయమై ఆదాయాపన్ను శాఖ తాజాగా కొత్త మార్గదర్శకాలు విడుదల చేసింది. ఈ ప్రకారం.. ఐటీ నోటీసులకు ప్రతిస్పందించని మదింపుదార్ల (అసెసీ) కేసులను తప్పనిసరిగా తనిఖీ చేయనుంది. పన్ను ఎగవేతకు సంబంధించిన నిర్దిష్ట సమాచారాన్ని, ఏదైనా చట్టబద్ద ఏజెన్సీ, నియంత్రణ అధికారులు అందించినా కూడా ఐటీ విభాగం సదరు కేసులను పరిశీలిస్తుంది.
 
ఆదాయ వ్యత్యాసాలకు సంబంధించి పన్ను అధికారులు జూన్‌ 30లోగా ఐటీ చట్టంలోని సెక్షన్‌ 143(2) కింద నోటీసు పంపాల్సి ఉంటుంది. వాటికి సమాధానాన్ని మదుపుదారుడు ఇవ్వాల్సి వుంటుంది. అలా చేయకపోతే, ఐటీ చట్టంలోని 142(1) ప్రకారం.. తదుపరి చర్యను తీసుకునే నేషనల్‌ ఫేస్‌లెస్‌ అసెస్‌మెంట్‌ సెంటరు (ఎన్‌ఏఎఫ్‌ఏసీ)కు పంపుతారు. 
 
ఈ సెక్షన్‌ కింద రిటర్న్‌ గురించి మరింత స్పష్టమైన సమాచారాన్ని, వివరాలను కోరుతూ నోటీసు జారీ చేసే అధికారం పన్ను అధికారులకు ఉంటుంది. రిటర్న్‌ దాఖలు చేయకపోతే, అవసరమైన సమాచారాన్ని సూచించిన పద్ధతిలో అందించాలనీ కోరవచ్చు. రద్దు చేసిన, ఉపసంహరించిన ఐటీ మినహాయింపులను క్లెయిమ్‌ చేయడం కొనసాగించిన కేసుల ఏకీకృత జాబితాను పన్ను విభాగం సిద్ధం చేస్తోంది.