గురువారం, 19 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. బిజినెస్
  3. వార్తలు
Written By సెల్వి
Last Updated : శనివారం, 14 మే 2022 (14:28 IST)

గోధుమల ఎగుమతులపై నిషేధం.. తక్షణం అమలులోకి...

wheat
రష్యా-ఉక్రెయిన్ యుద్ధ నేపథ్యంలో ప్రపంచవ్యాప్తంగా గోధుమల కొరత ఏర్పడింది. దీంతో ప్రపంచం తీవ్ర ఆహార సంక్షోభాన్ని ఎదుర్కోబోతోంది. ప్రస్తుతం దేశంలో పెరిగిన ఉష్ణోగ్రతలు కూడా గోధుమ పంట ఉత్పత్తిని తగ్గిస్తాయని అంచనా. 
 
దీంతో అప్రమత్తమైన కేంద్రం.. గోధుమ ఎగుమతుల్ని నిషేధిస్తూ ఆదేశాలు జారీ చేసింది. ఈ నిషేధం తక్షణం అమల్లోకి వస్తుందని తెలిపింది. వినియోగ ధరల ద్రవ్యోల్బణం ఎనిమిదేళ్ల గరిష్టానికి (7.79 శాతం), రిటైల్ ఫుడ్ ద్రవ్యోల్బణం 8.38 శాతానికి చేరిన నేపథ్యంలో కేంద్రం ఈ నిర్ణయం తీసుకుంది.
 
అన్ని రకాల గోధుమల ఎగుమతులపై నిషేధం విధించింది. అయితే, రెండు అంశాల్లో మాత్రం మినహాయింపునిచ్చింది. విదేశాలతో ఉన్న ఒప్పందం ప్రకారం, ఆయా దేశాలకు సరఫరా చేసే గోధుమలతోపాటు, ఇప్పటికే రవాణాకు సిద్ధం చేసిన గోధుమలను మాత్రం ఎగుమతి చేసేందుకు అనుమతి ఇచ్చింది.