శనివారం, 28 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. బిజినెస్
  3. వార్తలు
Written By
Last Updated : శనివారం, 1 జూన్ 2019 (09:52 IST)

భారత్‌కు షాకిచ్చిన చైనా.. ట్యాగ్‌లైన్ కొట్టేసింది....

భారత్‌కు చైనా షాకిచ్చింది. కేంద్రంలో ప్రధానమంత్రిగా నరేంద్ర మోడీ రెండోసారి ప్రమాణ స్వీకారం చేసి ఇంకా 48 గంటలు కూడా పూర్తికాకముందే చైనా తేరుకోలేని షాకచ్చింది. ఇది ప్రధాని మోడీకి ఏమాత్రం మింగుడుపడని అంశంగా మారింది. 
 
ప్రస్తుతం భారత్ ప్రపంచంలో అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థ అనే ట్యాగ్‌లైన్ కలిగివుంది. దీన్ని చైనా కొట్టేసింది. దీనికి కారణం లేకపోలేదు. మార్చితో ముగిసిన త్రైమాసికంలో భారత వృద్ధిరేటు 5.8 శాతంగా నమోదైంది. అదే చైనా విషయానికి వస్తే ఇది 6.8 శాతంగా నమోదైంది. అంటే భారత వృద్ధిరేటు (జీడీపీ) ఐదేళ్ళ కనిష్ట స్థాయికో పడిపోవడం చైనాకు కలిసివచ్చింది. 
 
అయితే, అక్టోబరు నుంచి డిసెంబరుతో ముగిసిన త్రైమాసికంలో దేశ జీడీపీ 6.6 శాతంగా ఉండగా, మార్చితో ముగిసే సమయానికి ఇది 5.8 శాతానికి పడిపోయింది. మరోవైపు 2018-09 సంవత్సరంలో జీడీపీ వృద్ధిరేటు 6.8 శాతమని కేంద్ర గణాంకాల విభాగం వెల్లడించింది. 2017-18 సంవత్సరంలో ఇది 7.2 శాతంగా నమోదైన విషయం తెల్సిందే.