మంగళవారం, 18 జూన్ 2024
  1. వార్తలు
  2. బిజినెస్
  3. వార్తలు
Written By సెల్వి
Last Updated : గురువారం, 4 జనవరి 2024 (20:51 IST)

పెరిగిపోతున్న బియ్యం ధరలు.. రూ.7 నుంచి 8వేలకు పెంపు

rice
బియ్యం ధరలు అమాంతం పెరిగిపోతున్నాయి. క్వింటాల్ బియ్యం ధర రూ.7వేల నుంచి రూ.8వేల వరకు పెరిగిపోయాయి. గడిచిన నెల రోజుల వ్యవధిలోనే ఒక క్వింటాల్‌ బియ్యం ధర 1000 నుంచి 1500 రూపాయలకు పైగా పెరగడం గమనార్హం. 
 
కిలో సన్న బియ్యం రకం ప్రస్తుతం మార్కెట్లో 75 నుంచి 80 రూపాయలకు అమ్ముతున్నారు. కాగా.. ఈ ధరలను అదుపు చేసేందుకు కేంద్ర ప్రభుత్వం అన్ని రకాల చర్యలు చేపడుతోంది. 
 
ఇప్పటికే అన్నిరకాల బియ్యం ఎగుమతులపై నిషేధం విధించింది. దేశంలోని ప్రజలకు రాయితీ కింద రూ.25లకే కిలో బియ్యాన్ని ఇవ్వాలని కూడా నిర్ణయించి ఆ దిశగా చర్యలు చేపడుతున్నారు. త్వ‌ర‌లోనే ఎంపిక చేసిన రాష్ట్రాల‌లో కిలో రూ .25 కి ఇచ్చే స్టోర్‌ల‌ను ఏర్పాటు చేయ‌నుంది.