బుధవారం, 22 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By సెల్వి
Last Updated : గురువారం, 21 డిశెంబరు 2023 (18:53 IST)

రోజురోజుకు పెరిగిపోతున్న బియ్యం ధరలు.. కేంద్రం చర్యలు

rice
దేశంలో బియ్యం ధరలు రోజురోజుకు పెరిగిపోతుండటం ఆందోళన కలిగిస్తోంది. ముఖ్యంగా బాస్మతీయేతర బియ్యం ధరలు ఆకాశాన్నంటుతున్నాయి. మార్కెట్‌లో సన్న బియ్యం ధరలు పెరుగుతుండడంతో సామాన్యులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. 
 
ప్రస్తుతం నాన్ బాస్మతీ బియ్యం రకాన్ని బట్టి రూ.40 నుంచి రూ.60 వరకు విక్రయిస్తున్నారు. బహిరంగ మార్కెట్‌లో క్వింటాల్‌కు 1000 రూపాయలు. ఈ క్రమంలో ఇప్పటికే బియ్యం ఎగుమతులపై ఆంక్షలు విధించారు. 
 
మరికొద్ది నెలల్లో జరగనున్న సార్వత్రిక ఎన్నికల దృష్ట్యా బియ్యం ధరల నియంత్రణకు కేంద్ర ప్రభుత్వం చర్యలు చేపట్టింది. అందులో భాగంగానే తాజాగా వరి పరిశ్రమలకు కీలక ఉత్తర్వులు జారీ చేసింది.
 
 దేశీయ మార్కెట్‌లో బాస్మతీయేతర బియ్యం ధరలను సమీక్షించేందుకు, ఆహార,  ప్రజాపంపిణీ శాఖ కార్యదర్శి సంజీవ్ చోప్రా ఇటీవల రైస్ ప్రాసెసింగ్ పరిశ్రమల ప్రతినిధులతో సమావేశం నిర్వహించారు. 
 
సన్న బియ్యం ధర అదుపులో ఉంచేందుకు అన్ని రకాల చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. దేశంలోనే నాణ్యమైన బియ్యాన్ని ఓపెన్ మార్కెట్ సేల్స్ పథకం కింద రూ.29కే ప్రాసెసర్లకు అందిస్తున్నామన్నారు. 
 
రైస్ ప్రాసెసర్లు అదే బియ్యాన్ని మార్కెట్‌లో రూ.43 నుంచి రూ.50కి విక్రయిస్తున్నారు. దాన్ని దృష్టిలో ఉంచుకుని ఈ ఉత్తర్వులు జారీ చేస్తున్నామని సంజీవ్ చోప్రా సమావేశంలో వెల్లడించారు.