ఆదివారం, 22 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By సెల్వి
Last Updated : శనివారం, 16 డిశెంబరు 2023 (14:57 IST)

శ్రీరామ భక్తులకు శుభవార్త.. 1000కిపైగా ప్రత్యేక రైళ్లు

Ayodhya
శ్రీరామ భక్తులకు శుభవార్త. అయోధ్య రామ మందిరం ప్రారంభంలో భాగంగా అయోధ్యను దర్శించుకునేందుకు వెళ్లే భక్తుల సౌకర్యార్థం తొలి వంద రోజులు ఏకంగా 1000కిపైగా ప్రత్యేక రైళ్లను ప్రకటించింది. దేశంలోని ప్రధాన నగరాల నుంచి ఇవన్నీ అయోధ్యకు పరుగులు తీయనున్నాయి. 
 
మరోవైపు, భక్తల తాకిడిని తట్టుకునేలా అయోధ్య రైల్వే స్టేషన్‌ను పునరుద్ధరించారు. జనవరి 22న అయోధ్య రామమందిరం ప్రారంభం కానుండగా, 23న శ్రీరాముడి విగ్రహ ప్రతిష్ఠాపన ఉంటుంది. అదే రోజు నుంచి భక్తులకు ఆలయ దర్శనం అందుబాటులోకి వస్తుంది. అదే నెల 19 నుంచి రైళ్లు అందుబాటులోకి వస్తాయి.