శుక్రవారం, 8 నవంబరు 2024
  1. వార్తలు
  2. బిజినెస్
  3. వార్తలు
Written By వరుణ్
Last Updated : గురువారం, 22 డిశెంబరు 2022 (12:54 IST)

భారత్‌లో ఫాస్టెస్ట్ చార్జింగ్ ఫోన్... 12 నిమిషాల్లో ఫుల్

zero ultra
భారతదేశంలో అత్యంత వేగంగా చార్జింగ్ పూర్తయ్యే మొబైల్ ఫోన్ ఒకటి మార్కెట్‌లోకి వచ్చింది. ఇన్ ఫినిక్స్ అనే కంపెనీ ఈ మొబైల్‌ను తయారు చేసింది. జీరో అల్ట్రా పేరుతో ఈ నెల 25వ తేదీ క్రిస్మస్ పండుగ రోజున మార్కెట్లోకి విడుదల చేయనుంది. ఫ్లిప్‌కార్ట‌లో ఈ ఫోనును కొనుగోలు చేయొచ్చు. ఈ ఫోన్ ప్రారంభ ధర కూడా రూ.29999గా నిర్ణయించారు. 
 
ఈ ఫోన్ ఫీచర్లను పరిశీలిస్తే, ఆండ్రాయిడ్ 12 ఆపరేటింగ్, 6.8 అంగుళాల హెచ్.డి. అమోల్డ్ డిస్ ప్లే, ఫింగర్ ప్రింట్ లాక్, 200 ఎంపీ ప్రైమరీ కెమెరా, 13 ఎంపీ ఎల్టా వైడ్, మరో 2 ఎంపీ డెఫ్త్ కెమెరా, 33 ఎంపీ ఫ్రంట్ కెమెరా, 4500 ఎంఏహెచ్ఏ బ్యాటరీ వంటి ఫీచర్లను కలిగివుంది. ఇకపోతే, 180 వాట్ల సామర్థ్యంలో మన దేశంలో ఇప్పటివరకు అందుబాటులో ఉన్న స్మార్ట్ ఫోన్లలో ఫాస్ట్‌గా చార్జయ్యే ఫోన్‌గా జీరో అల్ట్రా నిలిచిపోనుంది.