ఈ అంతర్జాతీయ మూత్రపిండాల దినోత్సవ వేళ, భారతదేశంలో నెఫ్రాలజిస్ట్‌లకు సంబంధించి అతిపెద్ద ప్రొఫెషనల్ ఆర్గనైజేషన్, ప్రపంచ వ్యాప్తంగా మూత్రపిండాల ఆరోగ్యంకు కట్టుబడిన ఇండియన్ సొసైటీ ఆఫ్ నెఫ్రాలజిస్ట్స్(ఐఎస్‌ఎన్) మరియు సైన్స్ ఆధారిత బయో ఫార్మాస్యూటికల్ కంపెనీ ఆస్ట్రాజెనెకాలు పలు సంవత్సరాల కోసం ఒప్పందం చేసుకోవడంతో పాటుగా మూత్రపిండాల సంరక్షణ- ఆరోగ్య సంబంధిత సమస్యల పట్ల ప్రజలకు అవగాహన కల్పించడం, ముందుగా వ్యాధి నిర్ధారణ పరీక్షలను చేయించేలా ప్రైమరీ కేర్ ఫిజీషియన్లకు అవసరమైన విద్యను అందించడం, తగిన నిర్వహణ, ప్రమాదంలో ఉన్న రోగులకు దేశవ్యాప్తంగా పరీక్షలను నిర్వహించడం, సామాన్య ప్రజలకు సమయానుకూల రోగ నిర్దారణ, సమగ్రమైన నిర్వహణ పట్ల అవగాహన కల్పించనున్నారు.
దీర్ఘకాలిక మూత్రపిండాల వ్యాధులు (సీకెడీ) నేడు అంతర్జాతీయంగా మరణాలు మరియు వైకల్యానికి కారణమవుతున్నాయి. భారతదేశంలో సీకెడీకి అతి ముఖ్యమైన కారణంగా డయాబెటిక్ రెటినోపతి నిలుస్తుంది. అధ్యయనాలు వెల్లడించేదాని ప్రకారం భారతదేశంలో తుది దశ మూత్రపిండాల వ్యాధులు (ఈఎస్‌కెడీ) కలిగిన రోగులు అంటే డయాలసిస్ చేయించుకుంటున్న లేదా మూత్రపిండాల మార్పిడికి షెడ్యూల్ చేయబడిన వారి సంఖ్య సంవత్సరానికి ఒక లక్ష వరకూ ఉంటుందని అంచనా. మరీ విషాదకరమైన అంశమేమిటంటే, మూత్రపిండాల సమస్యలతో బాధపడుతున్న వారిలో ప్రతి 10 మందిలో 9 మందికి అసలు సమస్య ఉన్నట్లే తెలియదు.
ఈ సంవత్సర నేపథ్యమైన అందరికీ మూత్రపిండాల ఆరోగ్యంకు అనుగుణంగా ఐఎస్‌ఎన్‌తో పాటుగా అస్ట్రాజెనెకా ఇప్పుడు భారీ స్థాయిలో అవగాహన కల్పించడంతో పాటుగా మూత్రపిండాల ఆరోగ్యం మెరుగుపరుచుకోవడానికి ప్రజల ముందున్న మార్గాల పట్ల అవగాహన కల్పించనుంది. ఈ కార్యక్రమంలో భాగంగా అస్ట్రాజెనెకా, ఐఎస్‌ఎన్ యొక్క మార్గనిర్దేశకత్వంలో ప్రాజెక్ట్ సెర్చ్‌ను ప్రారంభించింది.
మధుమేహం లేదా హైపర్‌టెన్సివ్ రోగులలో సీకెడీలను ముందుగా గుర్తించేందుకు లక్ష్యంగా చేసుకున్న భారీ స్ర్కీనింగ్ ప్రోగ్రామ్ ఇది. ఈ క్యాంపెయిన్‌లో భాగంగా 2వేల మందికి పైగా ఫిజీషియన్ క్లీనిక్స్ ఒక నెల కాలంలో భారతదేశ వ్యాప్తంగా పలు ప్రాంతాలలో స్ర్కీనింగ్ పరీక్షలను నిర్వహించడం ద్వారా 2.4 లక్షల మంది రోగులను చేరుకోనున్నారు. దేశంలో అగ్రశ్రేణి నెఫ్రాలజిస్ట్‌లను రీజనల్ కో-ఆర్డినేటర్లగా సొసైటీ నియమించడంతో పాటుగా అవసరమైన శాస్త్రీయ మద్దతు మరియు మెంటార్‌షిప్‌ను భారతదేశవ్యాప్తంగా వీరి ద్వారా ఫిజీషియన్లకు అందించనుంది.
ఐఎస్‌ఎన్ ఈ విశ్లేషణకు నేతృత్వం వహించడంతో పాటుగా సేకరించిన డాటాను విధాన నిర్ణేతలు తమ నిర్ణయాలను మార్చుకునేందుకు సైతంఅందిస్తుంది. డాక్టర్ టీటీ పౌల్, ప్రెసిడెంట్- ఇండియన్ సొసైటీ ఆఫ్ నెఫ్రాలజీ, సౌత్ జోన్ చాఫ్టర్ మరియు సీనియర్ నెఫ్రాలజిస్ట్–వెస్ట్ ఫోర్ట్ హైటెక్ హాస్పిటల్, త్రిసూర్ మాట్లాడుతూ, ప్రతి సంవత్సరం అంతర్జాతీయ మూత్రపిండాల దినోత్సవాన్ని సామాన్య ప్రజలు, రోగుల నడుమ అవగాహన పెంపొందించేందుకు నిర్వహిస్తున్నాం. ఇటీవలి కాలం వరకూ కూడా మూత్రపిండాల వ్యాధులను గురించి చాలామందికి తెలియదు.దీని పట్ల అవగాహన కూడా లేదు. ఇప్పటికి కూడా ఎంతోమందికి మూత్రపిండాల సంరక్షణ గురించి ఎన్నో అపోహలు ఉన్నాయి.
అందువల్ల, ఈ సంవత్సర నేపథ్యం అందరికీ మూత్రపిండాల ఆరోగ్యం ద్వారా మెరుగైన అవగాహన కల్పించడం ద్వారా అత్యుత్తమ మూత్రపిండాల సంరక్ష ణ అందిస్తున్నాం. క్రమం తప్పకుండా రక్త, మూత్ర పరీక్షలు చేయడంతో పాటుగా అలా్ట్రసౌండ్ స్కాన్ ద్వారా కిడ్నీ ఫెయిల్యూర్ గుర్తించవచ్చు. మూత్రపిండాలు విఫలం కావడం వల్ల ఏం జరుగుతుందనే అంశం పట్ల అవగాహన కల్పించాల్సిన ఆవశ్యకత ఉంది. ముందుగా వ్యాధి గుర్తించడం, చికిత్స చేయించుకోవడం ద్వారా మూత్రపిండాల విఫల సమస్యను ఆలస్యం చేసుకోవచ్చు. ఈ వ్యాధి పట్ల అవగాహన కల్పించడంతో ఈ రోజుల్లో లభిస్తున్న చికిత్సలను గురించి అవగాహన కల్పించుకోవడం అవసరం అని అన్నారు.
మన ఆరోగ్య వ్యవస్థలో మూత్ర పిండాల వ్యాధుల భారం తగ్గించడంలో భాగంగా ఈ భాగస్వామ్యం ప్రధానంగా వినూత్నమైన అవగాహన కార్యక్రమాలను దేశవ్యాప్తంగా మూడు ఇంటరాక్టివ్ మాడ్యుల్స్‌తో టాప్ 30 నెఫ్రాలజిస్ట్‌లు 1000 మంది ప్రైమరీ ఫిజీషియన్లతో నిర్వహించనుంది. ఈ మాడ్యుల్స్ ద్వారా ముందస్తు నిర్ధారణ పరీక్షలు, అవగాహన మరియు మేనేజ్‌మెంట్ వ్యూహాలు పట్ల అవగాహన కల్పిస్తున్నారు.
డాక్టర్ రవిశంకర్ బోను, గౌరవ సెక్రటరీ- ఇండియన్ సొసైటీ ఆఫ్ నెఫ్రాలజీ, సౌత్ జోన్ చాప్టర్ అండ్ కన్సల్టెంట్ నెఫ్రాలజిస్ట్–మణిపాల్ హాస్పిటల్స్, వైట్ ఫీల్డ్, బెంగళూరు మాట్లాడుతూ మూత్ర పిండాల వ్యాధుల పట్ల అవగాహన కలిగి ఉండటంతో పాటుగా వాటిని ముందుగా కనుగొనడం అత్యంత కీలకం. మూత్రపిండాల వ్యాధుల బారిన పడి, నయం కానటువంటి మూత్రపిండాల వ్యాధుల బారిన పడకుండా ఉండేందుకు ఇది అత్యంత కీలకం. మధుమేహం, హైపర్‌టెన్షన్ లాంటి సమస్యలతో బాధపడుతున్న వారిలో ముందుగా వ్యాధిని గుర్తించడం అత్యంత కీలకం. కాళ్ల వాపు, యువతలో అధిక బీపీ కనుగొనడం, రాత్రి పూట తరచుగా మూత్రం పోయాల్సి రావడం వంటివి ముందస్తు లక్షణాలుగా తెలుసుకోవాలి. సులభంగా నీరసపడటం, ఆకలి మందగించడం, చర్మం రంగు మారడం లేదా అతి తక్కువ హీమోగ్లోబిన్ వంటివి అడ్వాన్స్‌డ్ మూత్ర పిండాల వ్యాధులకు సూచికలుగా భావించాలి అని అన్నారు.
వ్యాధిని కనుగొనే ప్రక్రియ గురించి ఆయన మాట్లాడుతూ మూడు సరళమైన పరీక్షల ద్వారా మూత్రపిండాల వ్యాధులను కనుగొనవచ్చు. ప్రొటీన్, రక్తం మూత్రం ద్వారా వెళ్తుందనేందుకు మూత్ర పరీక్ష, సెరమ్ క్రియాటిన్ మరియు అలా్ట్ర సోనోగ్రఫీ స్కాన్ వంటివి మూత్ర పిండాల పరిమాణం తెలుసుకునేందుకు చేయాలి అని అన్నారు
ఈ సందర్భంగా డాక్టర్ అనిల్ కుక్రేజా,వీపీ- రెగ్యులేటరీ అండ్ మెడికల్ ఎఫైర్స్, అస్ట్రాజెనెకా ఇండియా మాట్లాడుతూ దీర్ఘకాలిక మూత్రపిండాల వ్యాధి అంటే మూత్రపిండాలు సరిగా పనిచేయకపోవడం లేదా పూర్తి సామర్థ్యంతో పనిచేయకపోవడం. దీనిని మనం గుర్తించి సరిగా చికిత్స తీసుకోని ఎడల మూత్ర పిండాల సమస్యలు మరియు కొన్నిసార్లు మూత్రపిండాలు విఫలం కావడం జరగవచ్చు. సీకెడీ సంబంధిత మోర్టాలిటీ మరియు మార్బిడిటీ రేట్‌ను తగ్గించేందుకు ఈ భాగస్వామ్యం తోడ్పడుతుంది. దీనిద్వారా రోగులకు అవగాహన కల్పించడంతో పాటుగా సామాన్య ప్రజలలో సైతం మెరుగైన అవగాహన కల్పించనున్నాం. అందువల్ల ముందుగా సమస్యను గుర్తించడమనేది అత్యంత కీలకం. ఇది దీర్ఘకాలిక ఆరోగ్యసమస్యల నివారణకూ తోడ్పడుతుందిఅని అన్నారు.