గురువారం, 25 జులై 2024
  1. వార్తలు
  2. బిజినెస్
  3. వార్తలు
Written By ఐవీఆర్
Last Modified: మంగళవారం, 18 జనవరి 2022 (22:29 IST)

మీ పోర్ట్‌ఫోలియోలో ఈఎల్‌ఎస్‌ఎస్‌ను పరిగణలోకి తీసుకునేందుకు కీలక కారణాలు

సరైన నాణ్యత కలిగిన ఆస్తులలో పెట్టుబడులు పెట్టడం యొక్క ప్రాముఖ్యతను నేటికి మదుపరులు గుర్తిస్తున్నారు. ఈ అభివృద్ధి చెందిన మరియు పూర్తి సమాచారం సమీకరించుకున్న మదుపరులకు  తమ సంపదను సృష్టించడానికి,  దానిని వృద్ధి చేసుకునేందుకు అత్యుత్తమ విధానం పెట్టుబడి అని తెలుసు (ఇది అతి శయోక్తి అనిపించవచ్చు). అయితే , వారిని వైవిధ్యంగా నిలిపే అంశమేమిటంటే, వారి ఆర్ధిక లక్ష్యాలు కేవలం సంపద సృష్టితోనే ముగిసిపోవు. వారు పన్నుల ప్రణాళికపై కూడా అంతే సమానంగా దృష్టి సారిస్తారు.

 
అంతేకాదు, దీని కోసం సంవత్సరం ఆఖరు వరకూ వేచి చూడరు. తొలుత, మదుపరులు తమ పన్ను ఆదా కోసం ఇతర పెట్టుబడి అవకాశాలను అన్వేషించడం జరిగేది. అయితే అది క్లిష్టతరమైన ప్రక్రియగా మారింది. వారు మాన్యువల్‌‌గా  ట్యాక్స్‌లను ఫైల్‌ చేయాల్సి వచ్చేది. నేడు, డిజిటైజేషన్‌ కారణంగా ఈ మొత్తం ప్రక్రియ సౌకర్యవంతంగా మరియు పారదర్శకంగా మారుతుంది.

 
ఇప్పుడు ఎంచుకునేందుకు అనేక మార్గాలు ఉన్నప్పటికీ ఈఎల్‌ఎస్‌ఎస్‌ (ఈక్విటీ లింక్డ్‌ సేవింగ్‌ స్కీమ్‌) విస్తృత ప్రయోజనాల రీత్యా తొలి వరుసలో నిలిచింది. అవగాహన లేని వారికి చెప్పాలంటే, ఈఎల్‌ఎస్‌ఎస్‌ మ్యూచువల్‌ ఫండ్స్‌ ప్రధానంగా ఈక్విటీ మరియు ఈక్విటీ సంబంధిత స్కీమ్‌లలో పెట్టుబడులు పెడతాయి. ఇవి వ్యక్తులు 1.6 లక్షల రూపాయల వరకూ తమ వార్షిక ఆదాయంపై రాయితీని ఆదాయపన్ను చట్టం 1961 లోని సెక్షన్‌ 80సీ కింద పొందవచ్చు. ఈఎల్‌సీసీలో పెట్టుబడులు పెట్టేందుకు మదుపరులు తమ కెవైసీ పూర్తిగా పూరించి ఉడటంతో పాటుగా గ్రోత్‌, డివిడెండ్‌ లేదా డివిడెండ్‌ రీ ఇన్వెస్ట్‌మెంట్‌ అవకాశంలో పెట్టుబడులు పెట్టవచ్చు. మదుపరులు ఈఎల్‌ఎస్‌ఎస్‌లో సిప్స్‌ లేదా ఏకమొత్తంలో పెట్టుబడులు పెట్టవచ్చు.

 
పెట్టుబడి పోర్ట్‌ఫోలియోలో ఈఎల్‌ఎస్‌ఎస్‌ను పరిగణలోకి తీసుకునేందుకు అత్యంత కీలకమైన కొన్ని కారణాలు:
అసలైన పన్ను ప్రయోజనం: ఈఎల్‌ఎస్‌ఎస్‌తో పన్ను ప్రయోజనాలు ఉన్నాయని అందరికీ తెలుసు కానీ తెలుసుకోవాల్సింది ఏమిటంటే ఆ ప్రయోజనం ఏ విధంగా లభిస్తుందని. మ్యూచువల్‌ ఫండ్స్‌లో పెట్టుబడులన్నీ కూడా ఏదో ఒక రూపేణా పన్ను భారాన్ని రిడెంప్షన్‌ లేదా స్విచ్‌ సమయంలో ఈఎల్‌ఎస్‌ఎస్‌ అయినా సరే మోయాల్సి ఉంటుంది. ప్రస్తుత పన్ను చట్టాల ప్రకారం, ఒక సంవత్సరం కన్నా ఎక్కువగా ఉన్న ఈక్విటీ మ్యూచువల్‌ ఫండ్స్‌ పై లాంగ్‌ టర్మ్‌ క్యాపిటల్‌ గెయిన్‌ పన్ను చెల్లించవలసి ఉంటుంది. ఈ గెయిన్స్‌కు ఇండెక్సేషన్‌ ప్రయోజనం లేకుండా 10% చొప్పున పన్ను చెల్లించాల్సి ఉంటుంది. మొత్తంమ్మీద లిస్టెడ్‌ ఈక్విటీ షేర్‌ లేదా ఈక్విటీ ఓరియెంటెడ్‌ మ్యూచువల్‌ ఫండ్‌(ఈఎల్‌ఎస్‌ఎస్‌ సహా)పై లాంగ్‌ టర్మ్‌ క్యాపిటల్‌ గెయిన్స్‌ పైన ఒక లక్ష వరకూ పన్ను మినహాయింపు ఉంటుంది.

 
లాక్‌ ఇన్‌ కాలం ఓ వరం: సరైన నాణ్యత కలిగిన ఆస్తులలో పెట్టుబడులు పెట్టడం యొక్క ప్రాముఖ్యతను అనుభవజ్ఞులైన మదుపరులు వెల్లడిస్తూనే ఉంటారు. కనీస లాక్‌ ఇన్‌ పీరియడ్‌ ఐదేళ్లుగా ఉంటే, ఇతర పన్ను ఆదా ఇన్‌స్ట్రుమెంట్స్‌కు వ్యతిరేకంగా ఈఎల్‌ఎస్‌ఎస్‌కు కనీస లాక్‌ ఇన్‌ కాలం మూడేళ్లు మాత్రమే ఉంటుంది. ఈ లాక్‌ ఇన్‌ కాలంకు అతి పెద్ద వరం ఏమిటంటే, ఇది క్రమశిక్షణతో కూడిన పెట్టుబడి విధానాన్ని మదుపరుల నడుమ అలవాటు చేస్తుంది. మరీ ముఖ్యంగా సిప్‌ (దీనికి క్రమానుగతంగా వాయిదాలను ముందుగా నిర్ధేశించిన తేదీలకు చెల్లించాల్సి ఉంటుంది) ద్వారా పెట్టుబడులు పెట్టే అవకాశం కల్పిస్తుంది.

 
ఈఎల్‌ఎస్‌ఎస్‌లోని అంతర్లీన ఆస్తులు ఎక్కువగా ఈక్విటీ సెక్యూరిటీలను కలిగి ఉన్నాయని మేము ఇప్పటికే గుర్తించాము. వీటి అస్థిరత మరియు నిరంతర ఒడిదుడుకులు అనుభవం లేని మదుపరులు ప్రమాదకరమైన నిర్ణయాలను తీసుకునేందుకు కారణమవుతాయి. మరీ ముఖ్యంగా ప్రస్తుత ధోరణులకు  స్పందించడంతో పాటుగా సుదీర్ఘకాల లక్ష్యాలపై దృష్టి కేంద్రీకరించడమూ వీలవుతుంది. మరోవైపు ఈఎల్‌ఎస్‌ఎస్‌ ప్రతి రోజూ మార్కెట్‌ వాతావరణంకు అనుగుణంగా రాబడులు ఉండవనే హామీనిస్తుంది.

 
నాణ్యత మరియు వృద్ధిపై సమగ్ర దృష్టి:
ఇతర ఆర్ధిక ఇన్‌స్ట్రుమెంట్స్‌లా కాకుండా, ఈఎల్‌ఎస్‌ఎస్‌ తమ ఫండ్‌ మేనేజర్లు దీర్ఘకాల వృద్ధి సామర్థ్యం కలిగిన  స్టాక్స్‌, కంపెనీలు మరియు రంగాలపై పెట్టుబడులు పెట్టే అవకాశం అందిస్తుంది. అతను/ఆమె అత్యంత జాగ్రత్తగా బ్యాలెన్స్‌ షీట్‌ను విశ్లేషించడంతో పాటుగా మేనేజ్‌మెంట్‌ లక్ష్యాలు, ఈ రంగ కథను సరైన పోర్ట్‌ఫోలియో ఎంపికకు ముందుగానే పరిశీలించి నిర్ణయించవచ్చు. నాణ్యమైన పెట్టుబడుల ఆవశ్యకతను ఫండ్‌ మేనేజర్లు పదే పదే నొక్కి చెబుతున్నారు. ఈ కంపెనీలు ప్రతి రోజూ ఎక్సేంజ్‌పై అద్భుతాలను సృష్టించలేకపోవచ్చు కానీ దీర్ఘకాలిక లాభాలను అందించడంలో మాత్రం వీటి స్ధిరత్వం కీలకంగా ఉంటుంది.

 
కాంపౌండింగ్‌ వెల్త్‌: ఈఎల్‌ఎస్‌ఎస్‌కు కేవలం మూడేళ్లుమాత్రమే లాక్‌ ఇన్‌ పీరియడ్‌ ఉన్నంత మాత్రాన చెప్పబడిన కాల పరిమితి తరువాత మీ పెట్టుబడులు ఉపసంహరించుకోవాల్సిన అవసరం లేదు. ఒకవేళ మదుపరులు తమ పెట్టుబడులపై వచ్చే రాబడులు పట్ల సంతోషంగా ఉంటే, వారు తమ పెట్టుబడులు కొనసాగించవచ్చు. సుదీర్ఘకాలంలో మరింతగా లాభాలను స్వీకరించవచ్చు. సాధారణంగా ఈఎల్‌ఎస్‌ఎస్‌ స్కీమ్‌పై వచ్చే రాబడులు సహేతుకంగా ఉంటాయి. మూడు సంవత్సరాల కాలంలో, ఈ కాంపౌండింగ్‌ శక్తి ఈక్విటీ లింకేజీతో వచ్చే రాబడులతో కలిసి మదుపరులకు సహేతుకమైన రాబడులను అందిస్తాయి.

 
మదుపరులు ఎంచుకునేందుకు విస్తృతశ్రేణి అవకాశాలు ఉండటం చేత వారెప్పుడూ కూడా పన్ను పొదుపు మార్గాల కోసం వెదకడంతో పాటుగా పలు పన్ను ఆదా ఇన్‌స్ట్రుమెంట్స్‌, వాటి వైవిధ్యమైన ఫీచర్లు సైతం మదుపరులకు ఆకర్షణీయంగా ఉంటాయి. అయితే, ఈఎల్‌ఎస్‌ఎస్‌ ప్రాధాన్యతా అవకాశంగా వాటిలోని సౌకర్యం, పారదర్శకత పరంగా కనిపించడంతో  పాటుగా పన్ను పరంగా ఆదా చేస్తూనే సంపదనూ సృష్టిస్తుంది.

 
ఇలా చెబుతూ పోతే, మదుపరులు 2020-21 ఆర్ధిక సంవత్సరం నుంచి కొత్త పన్ను విధానం మరియు పాత పన్ను విధానాల నుంచి ఎంచుకోవచ్చని కూడా గుర్తుంచుకోవాలి. పాత పద్ధతిలో, మదుపరులు ప్రస్తుత మినహాయింపు నిబంధనలకనుగుణంగా ప్రయోజనం పొందవచ్చు. మరోవైపు, నూతన పద్ధతిలో తగ్గింపులు లేదంటే రాయితీలు వంటి సదుపాయాలు లేకేండా తక్కువ రాయితీ పన్ను కట్టాల్సి వస్తుంది.
-జినేష్‌ గోపానీ, హెడ్‌ ఈక్విటీ, యాక్సిస్‌ మ్యూచువల్‌ ఫండ్‌