సోమవారం, 23 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. బిజినెస్
  3. వార్తలు
Written By ఐవీఆర్
Last Modified: శుక్రవారం, 16 జులై 2021 (16:06 IST)

తమ వ్యాక్సినేషన్‌ జాబితాలో స్పుత్నిక్‌-వి టీకాను జోడించిన మణిపాల్‌ హాస్పిటల్

మణిపాల్‌ హాస్పిటల్స్‌, విజయవాడ నేటి నుంచి తమ కోవిడ్‌ వ్యాక్సిన్‌ కార్యక్రమంలో భాగంగా స్పుత్నిక్‌ వి టీకాను సైతం అందించనుంది. ప్రతి రోజూ దాదాపు 250 మందికి ఈ టీకాను హాస్పిటల్‌లో వేయనుంది. ప్రభుత్వం సూచించిన ధరల ప్రకారం ఈ టీకా ఒక మోతాదు ధర 1145 రూపాయలు.
 
ఈ టీకా గురించి మణిపాల్‌ హాస్పిటల్స్‌ మెడికల్‌ సూపరింటెండెంట్‌ డాక్టర్‌ చరణ్‌ తేజ్‌ కోయి మాట్లాడుతూ, ‘‘మా టీకా కార్యక్రమానికి స్పుత్నిక్‌ వి జోడించడం ద్వారా మా టీకా పోర్ట్‌ఫోలియోను మేము విస్తరించాం. ప్రజలకు ఆదివారం మినహా ప్రతి రోజూ ఉదయం 9 గంటల నుంచి సాయత్రం 5 గంటల వరకూ అందుబాటులో ఉంటాయి. ప్రజలు ముందస్తుగా  టీకా సమయాన్ని ఆరోగ్యసేతు యాప్‌ వద్ద నమోదు చేసుకోవచ్చు. దీనితో పాటుగా ప్రజలు నేరుగా హాస్పిటల్‌కు ముందుగా వెల్లడించిన సమయం లోపల వచ్చి టీకాలను తీసుకోవచ్చు. ఈ టీకాల సేకరణకు సంబంధించి అవసరమైన మార్గదర్శకాలను అనుసరిస్తూ అత్యంత జాగ్రత్తలతో కోల్డ్‌చైన్‌ నిర్వహిస్తున్నాం’’ అని అన్నారు.
 
మణిపాల్‌ హాస్పిటల్స్‌, హాస్పిటల్‌ డైరెక్టర్‌ డాక్టర్‌ సుధాకర్‌ కంటిపూడి మాట్లాడుతూ, ‘‘ కోవిడ్‌-19 మహమ్మారితో పోరాటంలో మేమెప్పుడూ ముందే ఉన్నాము. మా టీకా పోర్ట్‌ఫోలియోకు స్పుత్నిక్‌ వి టీకాను జోడించడం పట్ల చాలా సంతోషంగా ఉన్నాము. విజయవాడ, చుట్టు పక్కల ప్రాంతాలలో ఈ టీకాను అందిస్తున్న అతి కొద్ది ఆస్పత్రులలో ఒకటిగా మణిపాల్‌ హాస్పిటల్‌ నిలిచింది.
 
కోవాక్జిన్ మరియు కోవిషీల్డ్‌ టీకాలకు సంబంధించి ఇప్పటికే విజయవంతంగా టీకా కార్యక్రమాలను మేము నిర్వహిస్తున్నాం. ఇప్పటి వరకూ 70 వేలకు పైగా డోసులను విజయవంతంగా ప్రజలకు అందించడం జరిగింది. అదే తరహా విజయాన్ని స్పుత్నిక్‌ వి టీకా పరంగా కూడా నమోదు చేయాలనుకుంటున్నాం. అర్హత కలిగిన ప్రజలంతా ముందుకు రావడంతో పాటుగా టీకా తీసుకోవాల్సిందిగా కోరుతున్నాము. టీకా తీసుకున్నప్పటికీ, మాస్కు ధరించడం, శానిటైజేషన్‌ ప్రక్రియను అనుసరించడం మరియు భౌతిక దూర మార్గదర్శకాలను అనుసరించడం ద్వారా మాత్రమే కోవిడ్ 19 మహమ్మారితో పోరాడగలం. టీకా కోసం ప్రతి ఒక్కరూ ముందుకు రావడంతో పాటుగా ఏదైనా ఒక గుర్తింపు కార్డును తీసుకురావాల్సిందిగా కోరుతున్నాం. మొదటి డోస్‌ తీసుకున్న 21 రోజుల తరువాత ఖచ్చితంగా రెండవ డోస్‌ తీసుకోవాలి’’ అని అన్నారు.
 
విజయవాడకు చెందిన 40 సంవత్సరాల వ్యక్తి శ్రీ గారపాటి సాయి పవన్‌, మొదటి మోతాదు స్పుత్నిక్‌ వి టీకా అందుకున్నారు. టీకా ప్రక్రియ గురించి ఆయన మాట్లాడుతూ, ‘‘నేడు నా తొలి మోతాదు టీకాను వేయించుకోవడం పట్ల చాలా సంతోషంగా ఉన్నాను. అంతేకాదు, మణిపాల్‌ హాస్పిటల్‌ విజయవాడలో స్పుత్నిక్‌ వి టీకా అందుకున్న తొలి వ్యక్తిని కూడా కావడం ఆనందంగా ఉంది. ఈ టీకా కార్యక్రమం నిర్వహించిన మణిపాల్‌ హాస్పిటల్స్‌కు ఈ సందర్భంగా ధన్యవాదములు తెలుపుతున్నాను. దీనిద్వారా ప్రతి ఒక్కరికీ టీకా అందుబాటులో ఉందనే భరోసా అందిస్తున్నారు. ప్రతి ఒక్కరూ బయటకు వచ్చి తమతో పాటుగా తమ కుటుంబ సభ్యులకు టీకాలను పొందేలా చేయాలని అభ్యర్ధిస్తున్నాను’’ అని అన్నారు.