శుక్రవారం, 8 నవంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. కరోనా
Written By ఠాగూర్
Last Updated : మంగళవారం, 13 జులై 2021 (16:58 IST)

అన్ని రకాల వేరియంట్లకు స్పుత్నిక్-వితో చెక్?

కరోనా వైరస్ బారినపడకుండా ఉండేందుకు వివిధ దేశాలు పలు రకాలైన టీకాలను తయారు చేశారు. ఇలాంటి వాటిలో రష్యా తయారు చేసిన స్పుత్నిక్-వి ఒకటి. ప్రస్తుతం ఈ టీకా కూడా భారత్‌లో వినియోగానికి అందుబాటులోకి వచ్చింది. అయితే, ఈ వ్యాక్సిన్ కరోనా అన్ని వేరియంట్లను అడ్డకుంటున్నట్లు గ‌మ‌లేయా నేష‌న‌ల్ రీసెర్చ్ సెంట‌ర్ ఆఫ్ ఎపిడ‌మాల‌జీ వెల్లడించింది. 
 
రష్యాకు చెందిన స్పత్నిక్-వి టీకా డెల్టా సహా కరోనా అన్ని వేరియంట్లపై సమర్థవంతంగా పనిచేస్తుందని తాజా అధ్యయనం తెలిపింది. నేరుగా వైర‌స్‌నే ఉప‌యోగించి చేసిన వైర‌స్ న్యూట్ర‌లైజింగ్ యాక్టివిటీ (వీఎన్ఏ)ని అంచ‌నా వేసి ఈ అధ్య‌య‌నం జ‌రిగిన‌ట్లు తెలిపింది. 
 
క‌రోనా తొలి వేరియంట్ అయిన బీ.1.1.1 స‌హా ప్ర‌పంచంలోని వివిధ దేశాల్లో క‌నిపించిన వేరియంట్ల‌ను స్పుత్నిక్-వి వ్యాక్సిన్ ప్రేరిత సేరా ఎలా అడ్డుకుంటుందో ప‌రిశీలించారు. అంతేకాదు ఇత‌ర వ్యాక్సిన్ ఉత్ప‌త్తిదారుల‌తో క‌లిసి వ్యాక్సిన్ కాక్‌టెయిల్స్‌ను త‌యారు చేసే దిశ‌గా గ‌మ‌లేయా, ఆర్డీఐఎఫ్ అధ్య‌య‌నం నిర్వ‌హిస్తోంది.