శనివారం, 11 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. కరోనా
Written By సెల్వి
Last Updated : మంగళవారం, 13 జులై 2021 (15:18 IST)

స్పుత్నిక్ వి వ్యాక్సిన్‌ సామర్థ్యం అదుర్స్.. కేవలం సింగిల్ డోసుతోనే..?

కరోనా వ్యాక్సినేషన్ విషయంలో అర్జెంటీనాలో జరిగిన పరిశోధనలో వెల్లడైన కీలక విషయాలు ఆశాజనకంగా ఉన్నాయి. స్పుత్నిక్ వి వ్యాక్సిన్‌పై చేసిన పరిశోధనల్లో ఆసక్తికర విషయాలు వెలుగు చూశాయి.
 
కరోనా మహమ్మారి నియంత్రణకై ప్రపంచవ్యాప్తంగా వివిధ రకాల వ్యాక్సిన్లు అందుబాటులో ఉన్నాయి. ఇందులో ఒకటి రష్యాకు చెందిన స్పుత్నిక్ వి వ్యాక్సిన్. క్లినికల్ ట్రయల్స్‌‌లో 91.6 శాతం సామర్ధ్యం ఉందని తేలిన వ్యాక్సిన్ ఇది. త్వరలో ఇండియాలో కమర్షియల్ లాంచ్ కానుంది. 
 
ఈ వ్యాక్సిన్‌పై అర్జెంటీనాలో జరిగిన పరిశోధనలో కీలక విషయాలు వెల్లడయ్యాయి. కోవిడ్ నుంచి కోలుకున్నవారికి స్పుత్నిక్ వి వ్యాక్సిన్ సింగిల్ డోసు ఇస్తే సరిపోతుందని తాజా పరిశోధనలో తేలింది. కరోనా సోకినవారు స్పుత్నిక్ వి రెండవ డోసు తీసుకున్నా పెద్దగా ప్రయోజనం ఉన్నట్టు కన్పించడం లేదని పరిశోధకులు తెలిపారు. సైన్స్ డైరెక్ట్ జర్నల్‌లో ప్రచురితమైన ఈ విషయాలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి.
 
కరోనా వైరస్ నుంచి కోలుకున్నవారు స్పుత్నిక్ వి రెండవ డోసు వేసుకుంటే యాంటీబాడీలు పెరగడంతో పాటు న్యూట్రలైజింగ్ సామర్ధ్యం పెరుగుతుందని స్పష్టం చేశారు. సింగిల్ డోసు పూర్తయిన తరువాత పరిశీలిస్తే పెద్దగా మార్పు లేదని అర్జెంటీనా పరిశోధన నివేదిక తెలిపింది.
 
కేవలం సింగిల్ డోసుతోనే Sputnik v 94 శాతం ప్రభావం కన్పిస్తోందని.. అందుకే రెండవ డోసుతో పెద్దగా మార్పు లేదని పరిశోధకులు తెలిపారు. ఈ పరిశోధన నేపధ్యంలో స్పుత్నిక్ వి వ్యాక్సిన్ డిమాండ్ మరింతగా పెరగనుంది.