ఈ రోజు, బెంచిమార్కు సూచీలు, నిఫ్టీతో వరుసగా రెండవ రోజు 9500 స్థాయిలో ముగిశాయి. సెన్సెక్స్ 595.37 పాయింట్లు లేదా 1.88% పెరిగి 32,200.59 వద్ద ముగిసింది. నిఫ్టీ 175.15 పాయింట్లు లేదా 1.88% పెరిగి 9,490.10 వద్ద ముగిసింది. నేటి ట్రేడింగ్ హెచ్డిఎఫ్సి బ్యాంక్ నేతృత్వంలోని బ్యాంకింగ్ స్టాక్స్‌లో ర్యాలీతో ప్రారంభమైంది, ఇది 4.85% పెరిగింది. ఈ రోజు బాగా పనిచేసిన ఇతర రంగాల స్టాక్స్‌లో రిలయన్స్ ఇండస్ట్రీస్ (1.76%) మరియు మారుతి సుజుకి (3.92%) ఉన్నాయి.
జీ ఎంటర్టైన్మెంట్ (9.58%), హీరో మోటోకార్ప్ (5.18%), ఐషర్ మోటార్స్ (7.34%), ఇండస్ఇండ్ బ్యాంక్ (4.15%), మరియు ఎల్ అండ్ టి(5.78%)లు నిఫ్టీలో అత్యధిక లాభాలను ఆర్జించగా, ఎక్కువ నష్టపోయినవారు, విప్రో (-0.92%) ), జెఎస్డబ్ల్యు స్టీల్ (-0.43%), సిప్లా (-0.52%), ఐటిసి (-0.60%), బిపిసిఎల్ (-0.14%)గా ఉన్నారు. బిఎస్ఇ మిడ్క్యాప్ మరియు స్మాల్క్యాప్ సూచీ దాని విలువలో 1% పెరుగుదలను నమోదు చేసింది.
4వ త్రైమాసిన ఆదాయాలు
ఫెడరల్ బ్యాంక్ మార్చి త్రైమాసికంలో గత సంవత్సరంలో ఇదే కాలవ్యవధిలోని నికర లాభం రూ. 381.5 కోట్లతో పోల్చినప్పుడు రూ. 301.2 కోట్లు సాధించడంతో 21% పతనం నమోదైంది.
లైసెన్సు ఒప్పందం
సన్ ఫార్మాస్యూటికల్ ఇండస్ట్రీస్ మరియు సన్ ఫార్మా అడ్వాన్స్డ్ రీసెర్చ్ కంపెనీ ఎస్సిడి-044 అని పిలువబడే ఆటో-ఇమ్యూన్ రుగ్మతకు వ్యతిరేకంగా మౌఖిక చికిత్స యొక్క అభివృద్ధి మరియు వాణిజ్యీకరణపై ప్రపంచ లైసెన్సింగ్ ఒప్పందాన్ని ప్రకటించాయి.
భారతదేశంలో ఇ-స్పోర్ట్స్: భారతదేశంలో ఈ-స్పోర్ట్స్ మార్కెట్ వృద్ధి చెందడానికి భారతి ఎయిర్టెల్ నోడ్విన్ గేమింగ్‌తో ఒక ఒప్పందాన్ని ప్రకటించింది.
4.5% పెరిగిన స్టీల్ స్ట్రిప్స్ వీల్స్ షేర్ ధరలు
స్టీల్ స్ట్రిప్స్ వీల్స్ యురోపియన్ కారవాన్ ట్రెయిలర్ మరియు యుఎస్ మొబైల్ హోమ్ మార్కెట్ నుండి 25000 వీల్స్‌కు ఎగుమతి ఆర్డర్ను పొందింది. జూలైలో వారి చెన్నై ప్లాంట్ నుండి దీనిని అమలు చేయాల్సి ఉంది.
లాక్ డౌన్ ఆంక్షల సడలింపు
కరోనా మహమ్మారి కారణంగా, మార్కెట్ ఎక్కువగా నష్టపోయింది. అనేక దేశాలలో లాక్ డౌన్ ఆంక్షలు సడలించబడిననప్పుడు, ఆర్థిక కార్యకలాపాల పునఃప్రారంభమవుతున్నప్పుడు, ఈక్విటీ మార్కెట్లు బలంగా ముందడుగులు వేస్తాయని అంచనా. ప్రభుత్వం, కేంద్ర బ్యాంకుల ఉద్దీపన ప్రణాళికలు ప్రవేశపెడుతున్నాయి. ఇవి ఆర్థిక వ్యవస్థలో డిమాండ్‌ను పెంచుతాయి. అయితే అదే కారణంతో సమీప భవిష్యత్తులో చమురు ధరలు కూడా పెరిగే అవకాశం ఉంది.
జూన్ చివరి నాటికి మార్కెట్ 9700 స్థాయికి దగ్గరగా ఉంటుంది. ఈ స్థాయి 9000 కన్నా కొద్దిగా ఎక్కువ ఉన్నంత వరకు, వ్యాపారాలు మధ్యస్థ-కాలవ్యవధి బుల్ మార్కెట్లో తమ ఉనికిని చాటుతాయి.
భారతీయ రూపాయి
భారత రూపాయి బుధవారం రోజున డాలర్‌కు రూ. 75.75 వద్ద ముగిసింది. ఇది స్వల్పంగా తక్కువగా ఉంది.
- అమర్ దేవ్ సింగ్, హెడ్ అడ్వైజరీ, ఏంజెల్ బ్రోకింగ్ లిమిటెడ్