శనివారం, 28 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. బిజినెస్
  3. వార్తలు
Written By ఐవీఆర్
Last Modified: గురువారం, 6 అక్టోబరు 2022 (17:22 IST)

క్రికెటర్‌ కెఎల్‌ రాహుల్‌తో భాగస్వామ్యాన్ని బలోపేతం చేసుకున్న మెన్‌ ఆఫ్‌ ప్లాటినమ్‌

KL Rahul
కొంతమంది మగవారు పూర్తి ఆత్మవిశ్వాసం కలిగి ఉంటారు. సవాల్‌తో కూడిన పరిస్ధితులు ఎదురైనప్పుడు అసామాన్య ధైర్య సాహసాలనూ ప్రదర్శిస్తారు. తమవైన విలువలకు ఎలాంటి సమయంలో అయినా కట్టుబడి ఉండే  ధీరోదాత్తులు వీరు. ఈ క్రమంలో వీరు అనుసరించే విధానం, తమ చుట్టూ ఉన్న వారికి సైతం స్ఫూర్తి కలిగిస్తుంది. క్రికెట్‌ పిచ్‌ సైతం ఎంతోమంది క్యారెక్టర్‌కు పరీక్షగా నిలుస్తుంది. వీరిలో మనం అభిమానించే ఐకాన్స్‌ కూడా ఉంటారు. ప్రతి గేమ్‌లోనూ వీరు ఎన్నో కఠిన పరీక్షలు ఎదుర్కొంటారు. అయినప్పటికీ వారు తమదైన నమ్మకంతో ముందుకు వెళ్తారు. ప్రతిసారీ సరైన ఎంపికలు చేసుకుంటూ ముందుకు దూసుకుపోతుంటారు. వారు ఎంపిక చేసుకునే ఆటతీరు మరుపురాని క్షణాలను సృష్టిస్తాయి. క్రికెటింగ్‌ పండితుల ప్రశంసలనూ అందుకుంటాయి.
 
దేశం అభిమానించే అతి ముఖ్యమైన సీజన్‌, క్రికెట్‌ సీజన్‌ ప్రారంభమవుతున్న వేళ, ప్లాటినమ్‌ గిల్డ్‌ ఇండియా యొక్క మెన్‌ ఆఫ్‌ ప్లాటినమ్‌ ఇప్పుడు బాడ్మింటన్‌ స్టార్‌ కెఎల్‌ రాహుల్‌తో భాగస్వామ్యం చేసుకుని తమ నూతన ప్రచారం- క్యారెక్టర్‌ ఇన్‌స్పైర్స్‌ ఆల్‌ (మంచి లక్షణం అందరికీ స్ఫూర్తి కలిగిస్తుంది)ను  ప్రారంభించింది. ప్రతికూల పరిస్థితులలో సైతం ధైర్యంగా ముందుకు సాగి విజయం సాధించిన అతి అరుదైన పురుషులకు నివాళిగా ఇది ఉంటుంది. ఈ చిత్రంలో పలు చిత్రాలు కె ఎల్‌ రాహుల్‌కు సంబంధించి గ్రౌండ్‌ లోపల, బయట చిత్రాలను ప్రదర్శిస్తారు. మెన్‌ ఆఫ్‌ ప్లాటినమ్‌ కలెక్షన్‌ ధరించి వీటిలో అత్యంత ఆకర్షణీయంగా అతను కనిపిస్తాడు. ఆకట్టుకునే కథనం ఈ ప్రచారపు స్ఫూర్తిని వెల్లడిస్తుంది. ఈ ప్రచార చిత్రంలో కె ఎల్‌ రాహుల్‌ కథానాయకునిగా ఉంటాడు. ఈ చిత్రంలో తమ చుట్టూ ఉన్న వారికి స్ఫూర్తిని కలిగించేలా తమ చర్యలు ద్వారా మనలోని అసలైన లక్షణం వెల్లడించవచ్చని వెల్లడించారు. అదే సమయంలో అత్యంత అరుదైన లోహం- ప్లాటినమ్‌ను నిర్వచించే అసాధారణ లక్షణాలనూ వివరించారు. బలం, స్థిరత్వం, స్వచ్ఛత, మరియు ధృడత్వంకు ప్రతీకగా నిలిచే ప్లాటినమ్‌ ఈ పురుషులకు ఖచ్చితమైన ఎంపికగానూ నిలుస్తుంది.
 
ఈ ప్రచారం గురించి కెఎల్‌ రాహుల్‌ మాట్లాడుతూ, ‘‘ మెన్‌ ఆఫ్‌ ప్లాటినమ్‌ తాజా ప్రచారంలో భాగం కావడం పట్ల చాలా సంతోషంగా ఉన్నాను. మన స్వభావమే ఇతరులకు స్ఫూర్తిగా నిలిచేందుకు తోడ్పడుతుందని నేను నమ్ముతున్నాను. మరీముఖ్యంగా ఆటలు ఆడేటప్పుడు ఇది మరింత ప్రస్ఫుటంగా కనిపిస్తుంది. సరదా సంభాషణలు టీమ్‌కు స్ఫూర్తిని అందివ్వవు. మనం చేసే పనులు, మన ఆలోచనా ధోరణి మాత్రమే స్ఫూర్తిని అందిస్తుంది. ఓ గేమ్‌ గెలవడం మాత్రమే ఎప్పుడూ మనల్ని విజేత చేయదు.  ఫీల్డ్‌ బయట మనం ఎలా ఉంటున్నామనేది కూడా మన ప్రయాణాన్ని వివరిస్తుంది’’ అని అన్నారు.
 
‘‘మెన్‌ ఆఫ్‌ ప్లాటినమ్‌తో ఈ సీజన్‌ ప్రారంభించడం పట్ల చాలా సంతోషంగా ఉన్నాము. క్రికెటింగ్‌ సీజన్‌తో పాటుగా పండుగలు కూడా ఒకేసారి వచ్చాయి. వైస్‌ కెప్టెన్‌ కె ఎల్‌ రాహుల్‌తో మా అనుబంధం బలోపేతం చేసుకోవడం పట్ల చాలా సంతోషంగా ఉన్నాము. అతను మెన్‌ ఆఫ్‌ ప్లాటినమ్‌ విలువలను ప్రతిబింబిస్తుంటారు. ఈ ప్రచారం ద్వారా మనందరికీ క్రికెట్‌ ఫీల్డ్‌కు ఆవల స్ఫూర్తిని కలిగించే క్యారెక్టర్‌ను ప్రదర్శించే ప్రతిష్టాత్మక క్షణాలను వేడుక చేస్తున్నాము. అవసరమైనప్పుడు ముందుండి నడిపించడం నాయకత్వ లక్షణం’’ అని సుజల మార్టిస్‌, డైరెక్టర్‌- కన్స్యూమర్‌ మార్కెటింగ్‌, ప్లాటినమ్‌ గిల్డ్‌ ఇంటర్నేషనల్‌- ఇండియా అన్నారు.
 
‘‘ఎన్నో సవాళ్లు మరియు మరెన్నో ప్రతికూలతలు కలిగినది ఈ ప్రపంచం. అయినప్పటికీ కొంతమంది తమకు ఎదురైన సంఘటనలను అతి తేలిగ్గా తీసుకుని ముందుకు సాగిపోతుంటారు. మేము ఈ అతి అరుదైన మగవారిని వేడుక చేస్తున్నాము. తమ చుట్టూ ప్రపంచం మారుతున్నా చలించని మనస్తత్వం వీరిది.  ఈ మగవారు విలువలు కలిగి ఉండటంతో పాటుగా ఇతరులకూ స్ఫూర్తి కలిగిస్తుంటారు. ఈ ప్రచారంలో మేము దానిని వేడుక చేస్తున్నాము’’ అని టెన్జిన్‌ వాంగ్డీ, క్రియేటివ్‌ డైరెక్టర్‌, ఫామస్‌ ఇన్నోవేషన్స్‌ అన్నారు. ఈ ప్రచారంలో భాగంగా మెన్‌ ఆఫ్‌ ప్లాటినమ్‌ పలు ప్రత్యేక కన్స్యూమర్‌ పోటీలు సైతం నిర్వహించనుంది. అదృష్టవంతులైన విజేతలు కె ఎల్‌ రాహుల్‌ సంతకం చేసిన మ్యాన్‌ ఆఫ్‌ ద ప్లాటినమ్‌ జెర్సీని గెలుచుకునే అవకాశం లభిస్తుంది.