శనివారం, 11 జనవరి 2025
  1. వార్తలు
  2. బిజినెస్
  3. వార్తలు
Written By ఐవీఆర్
Last Modified: బుధవారం, 5 అక్టోబరు 2022 (20:24 IST)

కెఎఫ్‌సి యొక్క ఇటీవలి చిత్రం 'క్షమత'లో, 'లేదు' అనే పదాన్ని వినని ఒక అమ్మాయి ఇష్మీత్

KFC
ఇష్మీత్ జీవిత కాలమంతటా ఎవరో ఒకరు ఆమె చేయి పట్టుకొని, ఆమెను కాపాడుతూ, ఆమెకు మార్గం చూపుతూ నడిపిస్తున్నారు. తాను 'నో' అనే పదం వినలేకుండా ఉన్నానని ఆమె పెద్దగా అరచి చెప్పేవరకూ కూడా. అప్పుడు ఏమి జరుగుతుంది? ఇష్మీత్‌ని వీక్షించండి మరియు కెఎఫ్‌సి (KFC) యొక్క ఇటీవలి చిత్రం ‘క్షమత’లో ఆమె ప్రయాణాన్ని అనుసరించండి. ఎన్నో ప్రశంసలు పొందిన చలనచిత్ర నిర్మాత షూజిత్ సర్కార్ గారిచే దర్శకత్వం వహించబడిన ఈ చిత్రం, సైగ భాషల అంతర్జాతీయ దినోత్సవం సందర్భంగా పివిఆర్ చాణక్యపురి ఢిల్లీలో ప్రత్యేకమైన పరిశీలనలో కెఎఫ్‌సి ఇండియా జనరల్ మేనేజర్ మోక్ష్ చోప్రా మరియు షూజిత్ గార్లచే ప్రారంభించబడింది.
 
అష్మిత్ కౌర్, సప్నా సోనీ గార్లచే అందంగా చిత్రీకరించబడి, హృదయాన్ని కదిలించే ఈ చిత్రం, ఇష్మీత్ తాను ఏమి చేయగలదో, ఏమి చేయజాలదో చెబుతూ సామాజిక సంకెళ్ళను ఛేదిస్తూ తెలియజేసే ఆమె జీవితం లోనికి ఒక సమగ్ర వీక్షణను అందిస్తుంది. ఈ స్క్రీనింగ్ అనంతరం, మోక్ష్, షూజిత్, ఓజిల్వీ, ఛీఫ్ క్రియేటివ్ అధికారి, రీతూ శారద, క్యాప్‌స్టోన్ పీపుల్ కన్సల్టింగ్ వ్యవస్థాపకులు, సిఈఓ, విమెన్ లీడర్‌షిప్ ఫోరమ్ ఆఫ్ ఏషియా వ్యవస్థాపకులు డా. సుజయ బెనర్జీ గార్లతో కూడిన ఒక ప్యానల్ చర్చ జరిగింది. అందులో ప్యానల్ సభ్యులు మాట- వినికిడి లోపము (SHI) కొరకు సంభావ్యతను వెలికితీయడంపై తమ అభిప్రాయాలను పరస్పర వినిమయం చేసుకున్నారు. ప్రజలను Speak Sign పట్ల ఆసక్తి చూపాల్సిందిగా కోరుతూ, ఈ వేడుక వద్ద అతిథులకు కెఎఫ్‌సి యొక్క ప్రత్యేక సమర్థత గల టీము సభ్యులు ఇంద్రజీత్ గారు ప్రాథమిక సైగ భాషలో బోధన ఇవ్వడం జరిగింది.  
 
క్షమత చిత్రం, సమర్థత అసమతుల్యతను భర్తీ చేసే దిశగా బ్రాండ్ యొక్క ప్రయాణం గురించి మాట్లాడుతూ, కెఎఫ్‌సి ఇండియా జనరల్ మేనేజర్ మోక్ష్ చోప్రా, ఇలా అన్నారు, "క్షమత ప్రోగ్రాముపై మా పని మా నియామక విధికి అతీతంగా వెళుతుంది. Speak Signతో, సమాచార వినిమయం యొక్క ఒక రూపముగా సైగ భాష పట్ల అవగాహన మరియు స్వీకారమును కలిగించడానికి ఉన్న అడ్డంకులను పక్కకు జరుపుతూ, చేకూర్పును బలపరుస్తూ మేము మా ప్రయత్నాలను బలోపేతం చేసుకుంటున్నాము. మా స్వంత టీము లోని ప్రత్యేక సమర్థతలు గల సభ్యులు ఎదుర్కొన్న జీవితాలు, వాస్తవాల నుండి స్ఫూర్తిగా తీసుకొని, ఇష్మీత్ యొక్క కథను సమర్పించడం పట్ల మేము అత్యంత గౌరవంగా భావిస్తున్నాము. ఈ కథను వాస్తవరూపం లోనికి తీసుకురావడంలో మాకు సహాయపడిన షూజిత్ సర్కార్ గారికి మరియు మా సంస్థ ఓజిల్వీ పట్ల మేము కృతజ్ఞులమై ఉన్నాము” అన్నారు.