మంగళవారం, 7 జనవరి 2025
  1. వార్తలు
  2. బిజినెస్
  3. వార్తలు
Written By సెల్వి
Last Updated : శుక్రవారం, 15 డిశెంబరు 2023 (13:36 IST)

భారత్ నుంచి స్మార్ట్ ఫోన్ ఎగుమతులు రెట్టింపు.. మోటారోలా

Motorola Moto G 5G India
మోటరోలా వచ్చే ఏడాది నుంచి భారత్ నుంచి స్మార్ట్‌ఫోన్ ఎగుమతులను రెట్టింపు చేయాలని యోచిస్తోంది. దీనిపై మోటరోలా ఆసియా-పసిఫిక్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ప్రశాంత్ మణి మాట్లాడుతూ, ఉత్తర అమెరికాలో భారతీయ సరుకులను పెంచడం ద్వారా ఇది సాధ్యమవుతుందన్నారు. 
 
ఉత్తర అమెరికా భారతదేశం నుండి మా ప్రాథమిక ఎగుమతి మార్కెట్ అని తెలిపారు. ప్రస్తుతం తాము 20-25 శాతం ఉత్తర అమెరికాకు ఎగుమతి చేస్తున్నాము. ఈ ఎగుమతి శాతాన్ని ప్రతి సంవత్సరం పెంచాలనుకుంటున్నామని చెప్పారు. 
 
వచ్చే ఏడాది 2024లో మా ఎగుమతులను రెట్టింపు చేయాలని సర్వం సిద్ధం చేస్తున్నట్లు మణి చెప్పుకొచ్చారు. ఈ క్యాలెండర్ సంవత్సరంలో, అక్టోబర్ వరకు సంస్థ 800,000 స్మార్ట్‌ఫోన్‌లు ఇప్పటికే ఎగుమతి చేసింది. వచ్చే ఏడాదిని ఈ ఎగుమతిని రెట్టింపు చేస్తామని మణి వెల్లడించారు.