శుక్రవారం, 24 జనవరి 2025
  1. వార్తలు
  2. బిజినెస్
  3. వార్తలు
Written By సిహెచ్
Last Modified: గురువారం, 22 ఏప్రియల్ 2021 (22:45 IST)

ఒకసారి ఛార్జ్ చేస్తే 100 కిలోమీటర్ల వరకూ ఆగదు ఈ ఇ-సైకిల్

భారతదేశపు ప్రముఖ ఇ-మొబిలిటీ బ్రాండ్ అయిన నెక్స్‌జూ మొబిలిటీ, కొత్త మేడ్ ఇన్ ఇండియా, సూపర్ లాంగ్ రేంజ్, 100 కిలోమీటర్ల వరకు ఒకే ఛార్జీలో నడిచే ఎలక్ట్రిక్ వాహనాన్ని విడుదల చేసింది. ఇదే కొత్త రోడ్‌లార్క్ ఎలక్ట్రిక్ సైకిల్. ఛార్జీకి 100 కిలోమీటర్ల రైడింగ్ రేంజ్, దృఢమైన కోల్డ్ రోల్డ్ స్టీల్ ఫ్రేమ్, ఆటోమోటివ్ గ్రేడ్ బిల్డ్ క్వాలిటీ, తొలగించగల బ్యాటరీ మరియు డ్యూయల్ డిస్క్ బ్రేక్‌ల వంటి కస్టమర్ సెంట్రిక్ లక్షణాలతో, కొత్త రోడ్‌లార్క్. స్కూటర్లతో పోల్చితే కొత్త రోడ్‌లార్క్ రోజువారీ ఇంట్రా సిటీ ప్రయాణాలకు ఎంతో సౌకర్యవంతమైనది.
 
సురక్షితమైన, సౌకర్యవంతమైన స్వారీ అనుభవం కోసం ఇ-బైక్ గంటకు 25 కి.మీ వేగంతో నడుస్తుంది. కొత్త రోడ్‌లార్క్ ధర రూ. 42 వేలు, వినియోగదారులు నేరుగా నెక్స్‌జూ యొక్క 90+ టచ్ పాయింట్స్ లేదా నెక్స్‌జూ మొబిలిటీ అధికారిక వెబ్‌సైట్ నుండి ఉత్పత్తిని కొనుగోలు చేయవచ్చు.