1. వార్తలు
  2. బిజినెస్
  3. వార్తలు
Written By ఠాగూర్
Last Updated : మంగళవారం, 2 ఫిబ్రవరి 2021 (11:57 IST)

పెట్రో భారం ప్రజలపై ఉండదు... కేంద్రం శుభవార్త

కేంద్ర విత్తమంత్రి నిర్మలా సీతారామన్ సోమవారం లోక్‌సభలో ప్రవేశపెట్టిన బడ్జెట్‌లో లీటరు పెట్రోలుపై రూ.2.50, డీజిల్ పైరూ. 4 చొప్పున ఏఐడీసీ (అగ్రికల్చర్‌ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ అండ్‌ డెవలప్‌మెంట్‌ సెస్)ను విధిస్తున్నట్టు ప్రకటించారు. దీంతో ఇంధన ధరలు పెరిగి, దాని ప్రభావం నిత్యావసరాలపై పడుతుందని పెద్ద చర్చలే జరిగాయి.
 
అయితే, ఆ వెంటనే ప్రజలపై మాత్రం ఈ భారం పడబోదని, పెట్రోల్, డీజిల్‌పై బేసిక్‌ ఎక్సైజ్‌ డ్యూటీ (బీఈడీ), స్పెషల్‌ అడిషనల్‌ ఎక్సైజ్‌ డ్యూటీ (ఎస్‌ఏఈడీ)ని తగ్గిస్తున్నామని కేంద్రం ప్రకటించింది.
 
ఈడీని రూ.2.98 నుంచి రూ.1.40కు, ఎస్ఏఈడీని రూ.12 నుంచి రూ.11కు తగ్గిస్తున్నామని, డీజిల్ పైలీటరుకు ప్రస్తుతమున్న బీఈడీని రూ.4.83 నుంచి రూ.1.80కు, ఎస్ఏఈడీని రూ.9 నుంచి రూ.8కి కుదిస్తున్నామని ప్రకటించింది. 
 
తాజాగా అగ్రికల్చర్‌ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ అండ్‌ డెవలప్‌మెంట్‌ సెస్‌ విధించినా పెట్రోల్, డీజిల్‌ ధరల్లో మార్పు ఉండదని,. వినియోగదారులపై అదనపు భారం పడబోదని కేంద్రం పేర్కొంది.