శుక్రవారం, 29 మార్చి 2024
  1. వార్తలు
  2. బిజినెస్
  3. వార్తలు
Written By ఠాగూర్
Last Updated : సోమవారం, 18 జనవరి 2021 (10:03 IST)

దూసుకెళ్తున్న పెట్రోల్ డీజల్ ధరలు.. సెంచరీ ఖాయమా?

దేశంలో పెట్రోల్, డీజిల్ ధరలు విపరీతంగా పెరిగిపోతున్నాయి. పెట్రోల్ ధరలపై నియంత్రణ ఎత్తివేసిన తర్వాత ఈ ధరకు కళ్లెం పడటం లేదు. ఫలితంగా ప్రతిరోజూ ధరలు పెరుగుతూనే ఉన్నాయి. ఈ క్రమంలో సోమవారం రోజువారీ సమీక్షలో భాగంగా పెట్రోల్‌, డీజిల్‌పై 25 పైసల చొప్పున పెంచుతూ దేశీయ చమురు కంపెనీలు నిర్ణయం తీసుకున్నాయి. 
 
దీంతో వారం రోజుల వ్యవధిలోనే పెట్రో ధరలు 75 పైసలు పెరిగాయి. తాజా పెంపుతో దేశ రాజధాని ఢిల్లీలో లీటర్‌ పెట్రోల్‌ ధర రూ.84.95, డీజిల్‌ ధర రూ.75.13కు చేరాయి. గత కొన్నిరోజులుగా వరుసగా పెట్రో ధరలు పెరుగుతున్నాయి. 
 
దీంతో జైపూర్‌లో పెట్రోల్‌ ధరలు దేశంలోనే అత్యధికానికి చేరాయి. జైపూర్‌లో లీటర్‌ పెట్రోల్‌ ధర రూ.92.43గా ఉండగా, డీజిల్‌ ధర రూ.84.46కు చేరింది. ఇక హైదరాబాద్‌లో పెట్రోల్‌ రూ.88.37, డీజిల్‌ రూ.81.99గా ఉన్నది. 
 
అలాగే, చెన్నైలో పెట్రోల్‌ రూ.87.64, డీజిల్‌ రూ.80.44, ముంబైలో పెట్రోల్‌ రూ.91.56, డీజిల్‌ రూ.81.87, బెంగుళూరులో పెట్రోల్‌ రూ.87.82, డీజిల్‌ రూ.79.67, కోల్‌కతాలో పెట్రోల్‌ రూ.86.39, డీజిల్‌ రూ.78.72 చొప్పున ఉన్నాయి.