విరాట్ కోహ్లీని తమ కొత్త బ్రాండ్ అంబాసిడర్‌గా నియమించిన నాయిస్
నాయిస్ బ్రాండ్ అనగానే మనందరికి గుర్తుకువచ్చేది నాణ్యత. దేశంలోనే అత్యుత్తమ లైఫ్‌స్టైల్ టెక్ బ్రాండ్ ఉత్పత్తులను అందిస్తోన్న సంస్థ నాయిస్. నాయిస్ సంస్థ ఇప్పుడు తమ స్మార్ట్ వాచ్‌లకు బ్రాండ్ అంబాసిడర్‌గా యూత్ ఐకాన్, కింగ్ ఆఫ్ క్రికెట్ ఇన్ ఇండియా విరాట్ కోహ్లీని నియమించింది. నాయిస్, విరాట్ కోహ్లీ ఇద్దరూ ఇద్దరే. ఇద్దరూ నిజమైన విజేతలు. వారిద్దరూ వారి వారి విభాగాల్లో నాయకులుగా ఉన్నారు. అందుకే వీరిద్దరూ ఇప్పుడు ఒక చోట చేరారు. మనలో ఉన్న శబ్దాన్ని అంటే ప్రతిభను చాలా ప్రశాంతంగా వినడం, విని దాన్ని ఆచరణలో పెట్టడం అనే కాన్సెప్ట్‌కు నాయిస్ మరియు విరాట్ ప్రతీకలుగా నిలుస్తారు. ఇప్పుడు విరాట్‌ని బ్రాండ్ అంబాసిడర్‌గా నియమించుకోవడం ద్వారా వినియోగదారుల విశ్వాసం పెరుగుతుంది. అలాగే బ్రాండ్‌పై వినియోగదారులకు మరింత నమ్మకం కుదురుతుంది.
ఈ సందర్భంగా నాయిస్ సహ వ్యవస్థాపకుడు శ్రీ గౌరవ్ ఖత్రీ మాట్లాడారు. ఆయన మాట్లాడుతూ… “భారత క్రికెట్ దిగ్గజం విరాట్ కోహ్లీని నాయిస్ బ్రాండ్ అంబాసిడర్‌గా నియమించడం నాకు చాలా సంతోషంగా ఉంది. విరాట్ ఎలా అయితే ప్రపంచస్థాయి విజేతగా మారాడో మేం కూడా మా స్మార్ట్‌వాచ్ డొమైన్‌లో అలాగే విశ్వవిజేతగా మారాం. విరాట్ ఎలా అయితే తాను అనుకున్న లక్ష్యాన్ని సాధించేందుకు నిరంతరం కష్టపడతాడో మేం కూడా మనసు చెప్పే శబ్దాన్ని వినేందుకు నిరంతర ఉత్సాహంతో పనిచేస్తుంటాం. ఇప్పుడు విరాట్‌తో అనుబంధం ద్వారా భారతదేశంలో మరియు విదేశాలలో ఉన్న యూత్ అందరికి మా బ్రాండ్ మరింత దగ్గర అవుతుందని మేము ఖచ్చితంగా భావిస్తున్నాము అని అన్నారు.
స్మార్ట్ కనెక్టెడ్ లైఫ్‌స్టైల్ ఇండస్ట్రీలో నాయిస్ ఎలా అయితే లీడర్‌గా ఉందో క్రికెట్ వరల్డ్‌లో విరాట్ కూడా అలాగే లీడర్‌గా ఉన్నాడు. అంతేకాకుండా విరాట్ ఎల్లప్పుడూ తన ఫిట్‌నెస్‌పై దృష్టిపెడుతుంటాడు. ఇంకా చెప్పాలంటే సూపర్-అథ్లెట్ల శకానికి నాంది పలకడంలో విరాట్ కీలక పాత్ర పోషించాడు. అందుకే మా స్మార్ట్ లైఫ్‌స్టైల్ ఉత్పత్తులకు అతను బ్రాండ్ అంబాసిడర్‌గా పర్‌ఫెక్ట్‌గా సరిపోతాడు.
స్మార్ట్ వాచ్ విభాగంలో నాయిస్ బలమైన భారతీయ బ్రాండ్‌గా ఉద్భవించింది. 9 త్రైమాసికాల్లో బలమైన బ్రాండ్ అనే నిర్వచనాన్ని నిలబెట్టుకుంది. ఇన్నాళ్లు ఈ ప్రయాణంలో స్థిరత్వాన్ని, సరికొత్త ఆవిష్కరణలు, తిరిగి ఆవిష్కరించే సామర్థ్యం మరియు మాస్ అప్పీల్‌ను ప్రదర్శిస్తుంది. ఇవన్నీ కూడా భారతదేశం గర్వించదగ్గ క్రికెటర్ విరాట్ కోహ్లికి ఉన్న లక్షణాలు.
ఈ సందర్భంగా విరాట్ కోహ్లీ మాట్లాడుతూ… “నేను ఎలా ఉంటానో, నాలా.. నా అభిరుచిగా తగ్గట్లుగా ఉండే బ్రాండ్‌లతో పనిచేయడాన్ని నేను ఎప్పుడూ కోరుకుంటాను, వాటిని నమ్ముతాను కూడా. నిరంతరం కొత్త స్టేట్‌మెంట్‌లను రూపొందిస్తున్న నాయిస్‌తో ఇప్పుడు భాగస్వామిగా మారినందుకు ఆనందంగా ఉంది. స్మార్ట్ వేరబుల్స్‌లో నాయిస్ భారతదేశాన్ని ప్రపంచ మ్యాప్‌లో ఉంచింది. నేను, నాయిస్ మేకర్స్ యొక్క ఉద్వేగభరితమైన బృందంలో చేరడానికి సంతోషిస్తున్నాను. లోపల శబ్దాన్ని వినాలనే మా ఇద్దరి తపనను ఈ భాగస్వామ్యం సూచిస్తుంది అని అన్నాడు. బ్రాండ్ అంబాసిడర్‌గా ఉన్న సమయంలో.. విరాట్ అన్ని టచ్ పాయింట్లను కలిగిన క్యాంపెయిన్‌లో పాల్గొంటాడు.