దేశ చరిత్రలో తొలిసారి.. పెట్రోల్ - డీజిల్ ధరలు సమానం
దేశ చరిత్రలో తొలిసారి ఓ రికార్డు నమోదైంది. దేశ రాజధాని ఢిల్లీలో పెట్రోల్, డీజిల్ ధరలు సమానమయ్యాయి. గత 17 రోజులుగా పెరుగుతూ వచ్చాయి. బుధవారం అంటే 18వ రోజు కూడా ఈ ధరలు పెట్రో ధరలు ప్రభుత్వ రంగ చమురు కంపెనీలు పెంచాయి. ఫలితంగా దేశంలో తొలిసారిగా పెట్రోల్, డీజిల్ ధరలు సమానమయ్యాయి.
దేశంలో లాక్డౌన్ నిబంధనలు సడలించిన తర్వాత, నిత్యమూ 'పెట్రో' ధరలను పెంచుకుంటూ పోతుండగా, ఈ 19 రోజుల వ్యవధిలో పెట్రోల్, డీజిల్‌పై దాదాపు రూ.10 వరకూ ధర పెరిగింది. ఇదేసమయంలో ఢిల్లీలో పెట్రోల్, డీజిల్ ధరలు సమానమయ్యాయి.
ప్రస్తుతం హస్తినలో పెట్రోలు ధర లీటరుకు రూ.79.88వుండగా, డీజిల్ ధర రూ.79.40కి చేరుకుంది. ఏ దేశంలోనైనా పెట్రోల్‌తో పోలిస్తే, డీజిల్ ధర తక్కువగా ఉంటుంది.
అయితే, ఢిల్లీలో డీజిల్ వాహనాల సంఖ్య భారీగా పెరిగిపోవడంతో ప్రభుత్వం డీజిల్‌పై విలువ ఆధారిత పన్ను (వ్యాట్)ను పెంచుకుంటూ వెళ్లింది. దీంతో రెండు ఇంధనాల ధరా సమానమైంది.
కాగా, ఇతర మెట్రో నగరాలైన హైదరాబాద్, కోల్ కతా, చెన్నై, ముంబై తదితర ప్రాంతాల్లో మాత్రం ఈ పరిస్థితి ఇంకా రాలేదు. ఈ నగరాల్లో మాత్రం వీటి ధరల్లో వ్యత్యాసం కనిపిస్తోంది.