నడ్డివిరుస్తున్న పెట్రోల్ - డీజల్ భారం
దేశంలో పెట్రోల్, డీజల్ ధరలు నానాటికీ పెరిగిపోతున్నాయి. ముఖ్యంగా ఈ ధరల భారం తెలుగు రాష్ట్రాల్లో మరింతగా అధికంగా ఉంది. బుధవారం తెలుగు రాష్ట్రాలలో మాత్రం చిన్నపాటి మార్పు కనిపిస్తున్నాయి.
ఇదిలావుంటే, హైదరాబాద్ నగరంలో లీటర్ పెట్రోల్ ధర రూ.108.22గా ఉంది. అలాగే, లీటర్ డీజిల్ ధర రూ.101.66గా ఉంది. విజయవాడలో లీటర్ పెట్రోల్ రూ.111.08కు లభిస్తుండగా, లీటర్ డీజిల్ ధర రూ.103.49లకు లభిస్తోంది.
దేశ రాజధాని ఢిల్లీలోని లీటర్ పెట్రోల్ ధర రూ.104.44 గా ఉండగా.. లీటర్ డీజిల్ ధర రూ.93.17 లకు లభిస్తోంది. ఇదేసమయంలో దేశ ఆర్థిక రాజధాని ముంబైలో లీటర్ పెట్రోల్ ధర రూ.110.41కు లభిస్తుండగా లీటర్ డీజిల్ ధర రూ.101.03 ఉంది.
చెన్నైలో పెట్రోల్ ధర రూ. 101.89 ఉండగా.. డీజిల్ ధర రూ.97.69గా ఉంది. బెంగళూరులో లీటర్ పెట్రోల్ ధర రూ.108.08 పలుకుతుండగా.. డీజిల్ ధర రూ.98.89గా ఉంది. లక్నోలో లీటర్ పెట్రోల్ ధర రూ. 101.47 ఉండగా.. లీటర్ డీజిల్ ధర రూ.93.61గా ఉంది.