1. వార్తలు
  2. బిజినెస్
  3. వార్తలు
Written By ఠాగూర్
Last Updated : శుక్రవారం, 11 జూన్ 2021 (09:45 IST)

బ్యాంకు ఖాతాదారులకు ఆర్బీఐ షాక్ : ఇకపై ఇంటర్‌ఛేంజ్ ఫీజు బాదుడు

బ్యాంకు ఖాతాదారులకు భారత రిజర్వు బ్యాంకు తేరుకోలేని షాకిచ్చింది. ఏటీఎం లావాదేవీలకు సంబంధించి బ్యాంకులు అధిక ఇంటర్‌ఛేంజ్‌ ఫీజును వసూలు చేయడానికి అనుమతి ఇచ్చింది. ఆర్బీఐ నిర్ణయంతో కస్టమర్లకు షాకిచ్చినట్లయింది. 
 
ఆర్బీఐ ఏటీఎం ఇంటర్‌ఛేంజ్‌ చార్జీలను పెంచుకోవచ్చని బ్యాంకులకు గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చింది. దీంతో బ్యాంకు ఫైనాన్షియల్‌ ట్రాన్సాక్షన్‌పై రూ.17 వరకు చార్జీ వసూలు చేసే అవకాశం ఉంది. ఈ ఫీజు ఇదివరకు రూ.15గా ఉండేది. అలాగే నాన్ ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్లకు ఈ చార్జీని రూ.5 నుంచి రూ.6కు పెంచింది. 
 
మీ బ్రాంచ్‌ ఏటీఎం కాకుండా మరో బ్యాంకు ఏటీఎంకు వెళ్లి డబ్బులు తీసుకుంటే.. అప్పుడు మీ బ్యాంకు .. ఏటీఎం బ్యాంక్‌కు డబ్బులు చెల్లించాలి. దీన్నే ఇంటర్‌ఛేంజ్ ఫీజు అని అంటారు. అంతేకాకుండా ఉచిత లావాదేవీల పరిమితి దాటిన తర్వాత బ్యాంకు కస్టమర్లు ఏటీఎంల నుంచి లావాదేవిలు నిర్వహిస్తే అప్పుడు బ్యాంకులు గరిష్టంగా ఒక్కో లావాదేవిపై రూ.21 వరకు వసూలు వసూలు చేయవచ్చు. 
 
ఈ చార్జీ ప్రస్తుతం 20 రూపాయలుగా ఉంది. ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్ల ఫీజు పెంపు నిర్ణయం 2022 జనవరి 1 నుంచి అమల్లోకి రానుంది. అదే నాన్ ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్ల ఫీజు పెంపు నిర్ణయం ఆగస్టు 1 నుంచి అమలులోకి వస్తుందని రిజర్వు బ్యాంకు వెల్లడించింది.