ఏటీఎంల నుంచి డబ్బు డ్రా ఇక మీ ఇష్టం... కానీ...
ఇప్పటివరకూ బ్యాంకు ఖాతాల్లో వున్న డబ్బును తీసుకోవడానికి నానా తంటాలు పడుతున్నారు. పెద్దనోట్ల రద్దు దగ్గర్నుంచి ఈ పరిస్థితి కొనసాగుతూ వుంది. ఈ నేపధ్యంలో ఆర్బీఐ ఓ చల్లని వార్త ఒకటి చెప్పింది. అదేమిటంటే... ఏటీఎంల్లో విధించిన క్యాష్ విత్డ్రా నిబంధనలను క
ఇప్పటివరకూ బ్యాంకు ఖాతాల్లో వున్న డబ్బును తీసుకోవడానికి నానా తంటాలు పడుతున్నారు. పెద్దనోట్ల రద్దు దగ్గర్నుంచి ఈ పరిస్థితి కొనసాగుతూ వుంది. ఈ నేపధ్యంలో ఆర్బీఐ ఓ చల్లని వార్త ఒకటి చెప్పింది. అదేమిటంటే... ఏటీఎంల్లో విధించిన క్యాష్ విత్డ్రా నిబంధనలను కరెంట్ ఖాతాదారులకు, క్యాష్ క్రెడిట్ ఖతాదారులకు, ఓవర్డ్రాఫ్ట్ ఖాతాదారులకు ఎత్తివేస్తున్నామని ప్రకటించింది.
తాము వెల్లడించిన ఈ కొత్త నిబంధన ఫిబ్రవరి 1, 2017 నుంచి అమలులోకి వస్తుందని తెలిపింది. సేవింగ్స్ బ్యాంకు ఖాతాదారుల విషయంలో మాత్రం ప్రస్తుత పరిమితి యథాతథంగా వుంటుందని తెలియజేసింది. ఐతే భవిష్యత్తులో సేవింగ్స్ బ్యాంకు ఖాతాదారులకు కూడా నిబంధనలను సవరిస్తామని తెలిపింది. సేవింగ్స్ బ్యాంక్ ఖాతాదారులు వారానికి రూ.24 వేలు తీసుకోవచ్చన్న సంగతి తెలిసిందే.