గురువారం, 13 ఫిబ్రవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By దేవి
Last Updated : గురువారం, 13 ఫిబ్రవరి 2025 (18:03 IST)

29 మిలియన్ వ్యూస్‌తో నెం.1 ప్లేస్‌లో విజయ్ దేవరకొండ కింగ్‌డమ్ టీజర్

trending in No.1  Kingdom Teaser poster
trending in No.1 Kingdom Teaser poster
హీరో విజయ్ దేవరకొండ నటిస్తున్న “కింగ్ డమ్” సినిమా టీజర్ యూట్యూబ్ లో టాప్ లో ట్రెండ్ అవుతోంది. నిన్న సాయంత్రం రిలీజ్ అయిన ఈ టీజర్ ప్రేక్షకుల నుంచి హ్యూజ్ రెస్పాన్స్ తెచ్చుకుంటోంది.24 గంటల్లో 29 మిలియన్ వ్యూస్ తో యూట్యూబ్ లో నెం.1 ప్లేస్ లో ఈ టీజర్ ట్రెండ్ అవుతోంది. “కింగ్ డమ్” సినిమా మీద ఆడియెన్స్ కు ఉన్న క్రేజ్ ను ఈ హ్యూజ్ రెస్పాన్స్ రిఫ్లెక్ట్ చేస్తోంది.
 
“కింగ్ డమ్”  టీజర్ లో విజయ్ దేవరకొండ న్యూ లుక్, క్యారెక్టరైజేషన్, హై ఎండ్ పర్ ఫార్మెన్స్ హైలైట్ గా నిలుస్తున్నాయి. దీనికి తోడు ఎన్టీఆర్, సూర్య, రణ్ బీర్ ఇచ్చిన పవర్ ఫుల్ వాయిసెస్ “కింగ్ డమ్”  టీజర్ కు అదనపు ఆకర్షణగా నిలుస్తున్నాయి.  యూట్యూబ్ తో పాటు అన్ని సోషల్ మీడియా ప్లాట్ ఫామ్స్ లో “కింగ్ డమ్” టీజర్ వైరల్ అవుతోంది.
 
“కింగ్ డమ్” చిత్రాన్ని యంగ్ టాలెంటెడ్ డైరెక్టర్ గౌతమ్ తిన్ననూరి రూపొందిస్తున్నారు. శ్రీకర స్టూడియోస్ సమర్పణలో సితార ఎంటర్ టైన్ మెంట్స్, ఫార్చూన్ ఫోర్ సినిమాస్ బ్యానర్స్ పై నాగవంశీ, సాయి సౌజన్య భారీ పాన్ ఇండియా చిత్రంగా నిర్మిస్తున్నారు. ఈ సినిమా మే 30న ఈ సినిమా వరల్డ్ వైడ్ గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు రెడీ అవుతోంది.