ఆదివారం, 12 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By ఠాగూర్
Last Updated : శుక్రవారం, 6 డిశెంబరు 2024 (08:45 IST)

Rashmika Dating Rumours దేవరకొండ ఫ్యామిలీతో కలిసి పుష్ప-2ను చూసిన రష్మిక

rashmika
Rashmika Mandanna Watches Pushpa-2 With Vijay Deverakonda's Family హీరోయిన్ రష్మిక మందన్నా డేటింగ్ అంశం మరోమారు తెరపైకి వచ్చింది. హీరో విజయ్ దేవరకొండ కుటుంబ సభ్యులతో కలిసి ఆమె తాజాగా నటించిన పుష్ప-2 చిత్రాన్ని థియేటర్‌లో వీక్షించారు. హైదరాబాద్ నగరంలోని హీరో మహేశ్ బాబుకు చెందిన ఏఎంబీ మాల్‌లో విజయ్ దేవరకొండ తల్లితో పాటు ఆయన సోదరుడు, హీరో ఆనంద్ దేవరకొండతో కలిసి రష్మిక ఈ చిత్రాన్ని చూశారు. 
 
ఇందులో శ్రీవల్లి పాత్రలో అర్జున్ భార్యగా అదరగొట్టిన విషయం తెల్సిందే. ఆమె నటనకు ప్రేక్షకు నుంచి పెద్ద ఎత్తు ప్రశంసలు వర్షం కురుస్తోంది. సోషల్ మీడియాలో ఎంతో యాక్టివ్‌గా ఉండే రష్మిక.. తనకు వస్తున్న ప్రశంసలపై స్పందిస్తూ ఈ చిత్రాన్ని ఆదరిస్తున్న ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు తెలిపారు. కాగా, గత కొంతకాలంగా రష్మిక మందన్నా - విజయ్ దేవరకొండలు డేటింగ్‌లో ఉన్నట్టు ప్రచారం సాగుతుండగా, వీటిని విజయ్ దేవరకొండ కూడా ఓ ఇంటర్వ్యూలో సూచన ప్రాయంగా నిర్ధారించారు కూడా. 
 
కాగా, సుకుమార్ దర్శకత్వంలో అల్లు అర్జున్ హీరోగా, రష్మిక మందన్నా హీరోయిన్‌గా, ఫహద్ ఫాజల్ ఐపీఎస్ అధికారిగా పోషించిన ఈ చిత్రం ఈ నెల 5వ తేదీన ప్రపంచ వ్యాప్తంగా విడుదలైన విషయం తెల్సిందే.