'పుష్ప-2' ఐటమ్ సాంగ్ : శ్రీలీలకు చెల్లించిన రెమ్యునరేషన్ ఎంతో తెలుసా?
సుకుమార్ - అల్లు అర్జున్‌ల కాంబినేషన్‌లో రూపొందిన పుష్ప-2 చిత్రం మరికొన్ని గంటల్లో విడుదలకానుంది. తెలుగు రాష్ట్రాల్లో మరికొన్ని గంటల్లో బెన్ఫిట్‌షోలు ప్రదర్శించనున్నారు. మరోవైపు, బన్నీ ఫ్యాన్స్ ఫుల్‌జోష్‌లో ఉన్నారు. బుధవారం ఉదయం నుంచే థియేటర్ల వద్ద హంగామా చేస్తున్నారు. పైగా, ఈ చిత్రంపై భారీ అంచనాలు నెలకొన్నాయి.
అయితే, ఈ చిత్రంలో నటించిన నటీనటులు, దర్శకుడు ఎంతెంత రెమ్యునరేషన్ తీసుకున్నారన్నది ఇపుడు టాక్ ఆఫ్ ది టౌన్‌గా మారింది. ఈ చిత్రంలో నటించిన ప్రధాన తారాగణానికి రెమ్యునరేషన్ ఇవ్వగా, హీరో అల్లు అర్జున్‌కు మాత్రం లాభాల్లో షేర్ తీసుకుంటానని చెప్పినట్టు సమాచారం. దీంతో ఆయనకు రూ.270 నుంచి రూ.280 కోట్ల మేరకు రెమ్యునరేషన్ అందుకోనున్నట్టు ప్రచారం సాగుతుంది.
మరోవైపు, ఈ సినిమాలో రెమ్యునరేషన్లు కూడా భారీగానే ఉన్నాయి. చిత్ర దర్శకుడు సుకుమార్ కేవలం దర్శకుడు మాత్రమే కాకుండా సహ నిర్మాత కూడా దీంతో ఆయనకు రూ.100 కోట్ల వరకు ముట్టే అవకాశం ఉంది. అలాగే, హీరోయిన్ రష్మికా మందన్నాకు రూ.10 కోట్లు, ఐటమ్ సాంగ్ చేసిన శ్రీలీలకు రూ.2 కోట్లు, విలన్ పాత్రను పోషించిన ఫహద్ ఫాజిల్‌కు రూ.8 కోట్లు చొప్పున ఇచ్చినట్టు తెలుస్తుంది. అలాగే, సంగీత దర్శకుడు దేవీశ్రీ ప్రసాద్‌కు రూ.5 కోట్ల మేరకు ఇచ్చినట్టు తెలుస్తుంది.