సోమవారం, 6 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By డీవీ
Last Updated : బుధవారం, 4 డిశెంబరు 2024 (08:19 IST)

అల్లు అర్జున్ ఖాతాలో అడ్వాన్స్ బుకింగ్‌లతో కొత్త రికార్డ్

Pushpa2 100 club poster
Pushpa2 100 club poster
అల్లు అర్జున్ నటించిన పుష్ప2 సినిమా ఆయన ఖాతాలో కొత్త రికార్డ్ స్రుష్టించింది. ఈ విషయాన్ని తెలియజేస్తూ చిత్ర యూనిట్ 100 కోట్ల మార్కు పోస్టర్ ను విడుదల చేసింది. కేవలం అడ్వాన్స్ బుకింగ్లతో నే ఈ మార్క్ చేరడం గర్వంగా వుందని చిత్ర నిర్మాణ సంస్థ తెలియజేస్తుంది. అతిపెద్ద భారతీయ చలనచిత్రం రికార్డు బద్దలు కొడుతోందంటూ ప్రచారం చేస్తోంది.
 
రష్మిక మందన్నా హీరోయిన్ గా దర్శకుడు సుకుమార్ తెరకెక్కించిన భారీ పాన్ ఇండియా చిత్రం “పుష్ప 2 ది రూల్” జస్ట్ ప్రీ సేల్స్ తోనే 100 కోట్ల వసూళ్లు కొల్లగొట్టేసిన పుష్ప 2 బన్నీ ఖాతాలో బిగ్గెస్ట్ రికార్డు సెట్ చేసింది. ఇది కాకుండా ఎక్స్(ట్విట్టర్) లో పలు చిత్రాలకి ఎమోజి రూపాన్ని అందిస్తుంటారు. రీసెంట్ గా సలార్ కి చేశారు. కానీ ఇపుడు పుష్ప 2 ఈ రేర్ ఫీట్ ని అందుకొని సాలిడ్ ప్రమోషన్స్ నడుమ ఇపుడు థియేటర్స్ లోకి వస్తుంది. మరి ఈ సినిమా విడుదల తర్వాత ఏమేరకు ఆదరణ పొందుతుందో చూడాల్సిందే.