గురువారం, 13 ఫిబ్రవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By దేవి
Last Updated : గురువారం, 13 ఫిబ్రవరి 2025 (17:21 IST)

బుక్ మై షోలో తల మూవీ టికెట్ ను కొన్న నాగార్జున

Nagarjuna, Amma Rajasekhar, Amma Ragin Raj, Esther Noronha
Nagarjuna, Amma Rajasekhar, Amma Ragin Raj, Esther Noronha
అమ్మ రాజశేఖర్ దర్శకత్వం వహించిన సినిమా 'తల'. ఈ చిత్రంతో అమ్మ రాజశేఖర్ తనయుడు అమ్మ రాగిన్ రాజ్ ఈ  హీరోగా పరిచయం అవుతున్నాడు.  అంకిత నస్కర్ హీరోయిన్. రోహిత్, ఎస్తేర్ నోరన్హ,ముక్కు అవినాష్, సత్యం రాజేష్, అజయ్, విజ్జి చంద్రశేఖర్, రాజీవ్ కనకాల, ఇంద్రజ ఇతర కీలక పాత్రల్లో నటించారు. శ్యామ్ కే నాయుడు సినిమాటోగ్రఫీ అందించిన ఈ చిత్రానికి ధర్మతేజ సంగీత దర్శకుడు. తల సినిమా ఈ 14న విడుదల కాబోతోంది. ఇప్పటికే తలపై భారీ అంచనాలున్నాయి. ప్రమోషనల్ కంటెంట్ చూసిన వాళ్లంతా ప్రామిసింగ్ గా ఉందని మెచ్చుకుంటున్నారు.
 
ఇక తాజాగా కింగ్ నాగార్జున బుక్ మై షోలో ఈ మూవీ ఫస్ట్ టికెట్ ను కొనుగోలు చేశారు. ఈ సందర్భంగా ఆయన ఈ చిత్ర ట్రైలర్ ను చూసి చాలా మెచ్చుకున్నారు. రాగిన్ రాజ్ పెద్ద హీరో అవుతాడని ఆశీర్వదించారు. అమ్మ రాజశేఖర్ డైరెక్షన్ చాలా ఇంట్రెస్టింగ్ గా ఉందని కితాబునిచ్చారు. అమ్మ రాజశేఖర్ తో తన మొదటి పరిచయాన్ని గుర్తు చేసుకుని ఈ సినిమా తప్పకుండా మంచి విజయం సాధించాలని ఆకాక్షిస్తూ.. నిర్మాత శ్రీనివాస్ గౌడ్ కు ఆల్ ద బెస్ట్ చెప్పారు.
బుక్ మై షోలో నాగార్జున తల మూవీ ఫస్ట్ టికెట్ ను కొనడం ఈ సినిమా సాధించబోతోన్న పెద్ద విజయానికి చిహ్నం అని దర్శకుడు అమ్మ రాజశేఖర్ ఈ సందర్భంగా ఆనందాన్ని వ్యక్తం చేశారు.