ఆదివారం, 22 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. బిజినెస్
  3. వార్తలు
Written By సెల్వి
Last Updated : శనివారం, 30 సెప్టెంబరు 2023 (15:56 IST)

రూ.2వేల రూపాయల నోటు మార్పిడికి సెప్టెంబర్ 30 లాస్ట్

2000 notes
రూ. 2000 డినామినేషన్‌లో ఉన్న నోట్లు సెప్టెంబర్ 30 వరకు చట్టబద్ధమైన చెల్లుబాటులో కొనసాగుతాయని సెంట్రల్ బ్యాంక్ పునరుద్ఘాటించింది. దీంతో రెండు వేల రూపాయల నోటుకు శనివారమే చివరి రోజు అని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తెలిపింది. 
 
రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ప్రకారం ప్రజలు రూ. 2,000 నోట్లను సెప్టెంబర్ 30, 2023 వరకు మార్చుకోవచ్చు. రూ. 2,000 నోట్లను ఇతర డినామినేషన్ల నోట్లలోకి మార్చుకోవడం రూ. 20,000 పరిమితి వరకు చేయవచ్చు. రూ. 2,000 నోట్ల మార్పిడి సౌకర్యం ఉచితంగా అందించబడుతుంది.